Begin typing your search above and press return to search.

నేటితో దుబ్బాక ప్రచారానికి తెర

By:  Tupaki Desk   |   1 Nov 2020 3:40 PM IST
నేటితో దుబ్బాక ప్రచారానికి తెర
X
తెలంగాణలో హోరాహరీగా సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రం 6 గంటలతో పార్టీల ప్రచారం దుబ్బాకలో ముగియనుంది.

ఇప్పటికే ఈ ఎన్నికలు సెగలు కక్కుతోంది. అధికార టీఆర్ఎస్ తో బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహరీగా తలపడుతున్నాయి. ఈ రోజు చివరిరోజు కావడంతో పార్టీలన్నీ మోహరించాయి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అన్ని అస్త్రాలను ఉపయోగించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇప్పటికే దుబ్బాకలో పార్టీల మధ్య విమర్శలు తీవ్రంగా సాగాయి. టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్టుగా రాజకీయాన్ని పండించాయి. టీఆర్ఎస్ , బీజేపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో రచ్చ రచ్చ చేస్తున్నాయి.

ఇక ఇవాళ్టితో ప్రచార హోరు ముగియనుండడంతో ఇక సవాళ్లు, ప్రతిసవాళ్లకు కూడా తెరపడనుంది. ప్రలోభాలకు తలుపులు తెరుస్తారు. ఓటుకు నోటు చొప్పున పంచడాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చీరలు,సారెలు, గిఫ్ట్ లు పోటెత్తుతాయి. ఇప్పటికే కులసంఘాలను ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలు బిజీగా ఉన్నాయట..

మూడు పార్టీలు విజయం కోసం శాయశక్తులా పోరాడుతున్నాయి. జనాన్ని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలంతా దుబ్బాకలోనే తిష్ట వేయడంతో హీట్ పెరిగింది.