Begin typing your search above and press return to search.

దుబ్బాక బైపోల్ : నోటా తో పోటీపడుతున్న కత్తి కార్తీక

By:  Tupaki Desk   |   10 Nov 2020 6:00 PM IST
దుబ్బాక బైపోల్ : నోటా తో పోటీపడుతున్న కత్తి కార్తీక
X
దుబ్బాకలో పొలిటికల్ హీట్ క్షణ క్షణానికి పెరిగిపోతుంది. గతంలో వన్ ‌సైడ్ ‌గా గులాబీ పార్టీ సొంతం చేసుకున్న ఈ సీటు.. ఇప్పుడు ఆ పార్టీ చేజారుతుందేమో అనే విధంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే , ఇప్పటివరకు దుబ్బాక ఎన్నికల కౌంటింగ్ లో మొత్తం పది రౌండ్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మొత్తంగా బీజేపీ 31,783.. టీఆర్‌ఎస్‌ 28,049.. కాంగ్రెస్‌ 6,699 ఓట్లు సాధించింది. ఇప్పటిదాకా మొత్తం 66,807 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇక ఇప్పటివరకు 7 రౌండ్లలో బీజేపీ , మూడు రౌండ్లలో టిఆర్ ఎస్ ఆధిక్యత ప్రదర్శించింది. ఇంకా 13 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో మొత్తం 23 మంది బరిలో నిలిచారు. వారిలో యాంకర్ కత్తి కార్తీక కూడా పోటీలో నిలిచింది. సీఈసీ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 45, 175 ఓట్లను లెక్కించగా.. 176 ఓట్లు పొందారు. ఇదిలా ఉంటే నోటాకు 160 ఓట్లు వచ్చాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె ప్రచారంలో అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. తనను అనేక విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని, అనేక ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లో నిలవాలన్నదే తన ఆశని ఆమె చెప్పుకొచ్చారు.

పోటీలో 23 మంది నిలిచినా కూడా ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ తరపున సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావులు బరిలో నిలిచారు.2018 ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది.