Begin typing your search above and press return to search.
దుబ్బాక ఫలితం ఏదైనా.. బ్యాండ్ పడేది సారుకేనా?
By: Tupaki Desk | 10 Nov 2020 10:00 AM ISTమీరీ కథనాన్ని చదివే సమయానికి దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలు కావటమే కాదు.. ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా ఎన్నికల్లో విజయం సాధిస్తే సంతోషం.. ఓడితే బాధ కలగటం మామూలే. కానీ.. దుబ్బాక ఉప ఎన్నిక మాత్రం అందుకు భిన్నమని చెబుతున్నారు. ఫలితం ఎలా ఉన్నా గులాబీ బాస్ కు మాత్రం చేదుగుళికగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా అంటే.. బోలెడన్ని కారణాలు చూపిస్తున్నారు.
దాదాపు 60వేలకు పైచిలుకు ఓట్లతో గత ఎన్నికల్లో దుబ్బాక సీటును టీఆర్ఎస్ గెలుచుకుంది. తెలంగాణలో తమకు తిరుగులేదని చెప్పే టీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీ అధినేత.. తమ మాటలు నిజమనితేలాలంటే దుబ్బాక లోజరిగిన ఉప ఎన్నికల్లో ఇప్పుడు కూడా 60వేల అధిక్యత రావాల్సి ఉంది. ఈ ఉప ఎన్నిక జరిగిన తీరు చూసినప్పుడే అదేమాత్రం సాధ్యం కాదు.
గతంలో జరిగిన ఎన్నికల్లో దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఎదురులేదన్నట్లుగా ఉండేది. అందుకు భిన్నంగా తాజా ఉప ఎన్నిక పోటాపోటీగా సాగటమే కాదు.. నవ్వా నేనా అన్నట్లుగా లడాయి పడింది. ఒక దశలో తెలంగాణ అధికారపక్షం టెన్షన్ కు గురైనట్లుగా చెబుతారు. సాధారణంగా ఉప ఎన్నిక ఏదైనా సానుభూతి వేవ్ ఉంటుంది. అందునా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన సందర్భంలో జరిగే ఉప ఎన్నికల్లో.. వారి కుటుంబ సభ్యులే బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఓటర్లలో వారి పట్ల ఉండే సానుభూతి గెలుపుకు బాట వేస్తుంది.
అయితే.. దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట మరణం తర్వాత.. ఇంకా చెప్పాలంటే ఉప ఎన్నిక ప్రారంభమైన తర్వాత కానీ ఆయనపై అక్కడి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత టీఆర్ఎస్ అధిష్టానానికి అర్థం కాలేదని చెబుతారు. పోటీ మొదట తమకు.. కాంగ్రెస్ కు మాత్రమేనని భావించినప్పటికి.. అనూహ్యంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారటం తెలిసిందే. ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచినా సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంటే.. మాత్రం కేసీఆర్ కు ఇది కాస్తా చేదు గుళికగా మారుతుందని చెప్పక తప్పదు.
ఇదంతా చూసినప్పుడు..దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం కేసీఆర్ కు మస్తు ఖుషీగా మారాటంటే.. టీఆర్ఎస్ అభ్యర్థి 60వేల పైచిలుకు ఓట్లతో గెలవటంతో పాటు.. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవటం.. బీజేపీకి దారుణంగా ఓట్లు వస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివేమీ సాధ్యం కాకపోవటంతో.. దుబ్బాక ఫలితం కేసీఆర్ కు చేదు గుళికగా చెప్పక తప్పదు.