Begin typing your search above and press return to search.
దుబ్బాక ఎన్నికల్లో కరోనా పేషెంట్లు ఎలా ఓటేశారంటే?
By: Tupaki Desk | 4 Nov 2020 11:45 AM ISTఒక ఉప ఎన్నిక రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. చివరకు జాతీయ స్థాయిలోనే ఈ ఉప ఎన్నిక గురించి ప్రస్తావన రావటం.. చర్చ జరగటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా దుబ్బాకలో ముగిసిన ఉప ఎన్నిక ఇదే కోవకు చెందింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి చెందిన ముఖ్యులు ప్రాతినిధ్యం వహించే మూడు నియోజకవర్గాల మధ్యలో ఉండే దుబ్బాక ఉప ఎన్నిక అధికార పక్షానికి చెమటలు పట్టించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దుబ్బాకకు ఓపక్క సిద్దిపేట.. మరోపక్క సిరిసిల్ల.. ఇంకోపక్క గజ్వేల్ నియోజకవర్గాలు ఉంటాయి. మూడు నియోజకవర్గాల్లో డెవలప్ మెంట్ కు.. దుబ్బాకలోని దుస్థితి ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశంగా మారింది. బోలెడన్ని నాటకీయ పరిణామాలు.. సంచలన అంశాల మధ్య సాగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 90 శాతం వరకు పోలింగ్ నమోదవుతుందని ఆశించినా.. 82.61 శాతానికి పరిమితమైంది. ఉదయం పోలింగ్ షురూ అయిన రెండు గంటల్లో తక్కువగా నమోదైనా.. తర్వాత మాత్రం ఓట్లు వేసేందుకు బారులు తీరారు. ఉదయం 9 నుంచి పదకొండు గంటల మధ్యలో.. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలోనే దాదాపు 42 శాతానికి మించి పోలింగ్ నమోదైంది. పలు చోట్లఈవీఎంలు మొరాయించటం.. ఓటు వేసే చోటు చీకటితో ఉందన్న ఫిర్యాదు పలువురి నుంచి వ్యక్తమైంది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు కరోనా పేషెంట్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పీపీఈ కిట్లు ధరించి ఎన్నికల కేంద్రానికి వచ్చిన వారు ఓటేశారు. మొత్తం 11 మంది కరోనా పేషెంట్లు ఓటువేయటం గమనార్హం. వీరు ఓటు వేసేందుకు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సమయాన్ని కేటాయించారు. అయితే.. చేగుంటలో ఒక పేషెంట్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. పీపీఈ కిట్ ధరించకుండా నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. కరోనా పేషెంట్ అని తెలియటంతో అక్కడి సిబ్బంది భయంతో వణికిపోయారు.
సమాచారం అందుకున్న తహసీల్దార్ అప్పటికప్పుడు పీపీఈ కిట్ తెప్పించి.. వాటిని ధరించిన తర్వాత ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ ఉదంతంతో ఎన్నికల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పోటాపోటీగా సాగిన ఉప ఎన్నిక ఫలితం ఈ నెల 10న వెల్లడి కానుంది. ఆ రోజు ఉదయం పది గంటల సమయానికే ఎవరు గెలుస్తారన్న అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.