Begin typing your search above and press return to search.
దుబ్బాకలో గెలిస్తే కేటీఆర్ ఖాతాలోకి.. ఓడితే హరీశ్ లెక్కలోకా?
By: Tupaki Desk | 2 Nov 2020 10:15 AM ISTదుబ్బాక ఉప ఎన్నిక పుణ్యమా అని గతంలో ఎప్పుడూ లేనంతగా తెలంగాణ రాజకీయం వేడెక్కిపోయింది. అధికార టీఆర్ఎస్ విపక్ష కాంగ్రెస్ మధ్య పోటీ ముఖాముఖిన ఉంటుందని భావిస్తే.. అందుకు భిన్నంగా టీఆర్ఎస్ - బీజేపీ అభ్యర్థుల మధ్య నెలకొన్న పోటీ ఇప్పుడు షాకింగ్ గా మారింది. కాంగ్రెస్ ను మూడో స్థానానికి పరిమితం చేసినట్లుగా తాజాగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు.
అధికార టీఆర్ఎస్ నేతలు సైతం తమ ఫోకస్ మొత్తం బీజేపీ నేతల మీదనే పెట్టారు తప్పించి.. కాంగ్రెస్ పార్టీని అస్సలు పట్టించుకోని పరిస్థితి. ఇక.. ఈ ఎన్నికలో అధికార పార్టీ తరఫున అన్ని తానై అన్నట్లుగా వ్యవహరించారు మంత్రి హరీశ్ రావు. తానే స్వయంగా బరిలోకి ఉన్నా కూడా కష్టపడనంత ఎక్కువగా తాజా ఉప ఎన్నిక కోసం హరీశ్ శ్రమిస్తున్నట్లు చెబుతున్నారు. రోజుకు దగ్గర దగ్గర 200 కి.మీ. ప్రచారాన్ని చేపట్టినట్లుగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకోవటం కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంత కష్టపడిన తర్వాత కూడా దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో సడన్ గా ఎంట్రీ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
మొన్నటికి మొన్న మీడియాతో జరిపిన ఇష్టాగోష్టి సమావేశంలో.. ప్రధాని మోడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయటం ద్వారా.. దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో తన పాత్రను చెప్పకనే చెప్పేశారు. దుబ్బాకలో అడుగు పెట్టని మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ లో ఉండి.. వివిధ అంశాల్ని మానిటర్ చుస్తున్న వైనాన్ని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలు.. మీడియా సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు.. విమర్శలు చేయటమే కాదు.. షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు దుబ్బాక గ్రౌండ్ లో హరీశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ అధినాయకత్వానికి సంబంధించిన కీలక నేతలు ఉప ఎన్నిక మీద పెద్ద ఫోకస్ పెట్టనట్లుగా కనిపిస్తుంది. దీంతో.. హరీశ్ గా హైలెట్ అయ్యారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో హరీశ్ కంటే కూడా కేటీఆర్ పేరు ఎక్కువగా నానుతుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. దుబ్బాక తుది ఫలితం ఎలా ఉన్నా.. మంత్రి హరీశ్ మాత్రం పులుసులో ములక్కాయ ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.
అదెలానంటే.. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిస్తే.. హరీశ్ కంటే కూడా కేటీఆర్ కే మైలేజీ అంటున్నారు. ఎందుకంటే.. బీజేకి ఝులక్ ఇవ్వటంతో మంత్రి కేటీఆర్ ఇప్పటికే రెండు..మూడు సార్లు తన సత్తా ఏమిటో చాటారు. ఒకవేళ.. అనూహ్యంగా దుబ్బాకలో పార్టీ ఓడితే.. హరీశ్ వైఫల్యమే పార్టీని ఓడేలా చేసిందన్న ఆరోపణలు ఎదుర్కోవటం ఖాయమంటున్నారు. దుబ్బాకలో గెలిచినా.. ఓడినా హరీశ్ కు పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటున్నారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితే తనకు ఎదురైతే మంత్రి హరీశ్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.