Begin typing your search above and press return to search.
దుబ్బాక పోలింగ్ అయ్యే వరకు హరీశ్ బొమ్మ రోజు కనిపించాలట
By: Tupaki Desk | 10 Oct 2020 10:45 AM ISTఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం అంతా ఓపెన్ అని అందరూ అంటుంటారు. కానీ.. అందులో నిజం లేదు. వాస్తవానికి సోషల్ మీడియా.. వాట్సాప్ వార్తల జోరు పెరిగిన తర్వాత.. అసలైన సమాచారం కంటే కూడా కల్పిత సమాచారం ఎక్కువైందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. గతంలో మాదిరి నేతలు.. అధికార క్షేత్రానికి దగ్గరగా ఉండేవారు గతంలో మాదిరి షేర్ చేసుకోవటం లేదు. పెరిగిన సాంకేతికత ఎవరిని ఓపెన్ కానివ్వటం లేదు. ముఖ్యమైన నేతలు ఎవరు కూడా గతం లో మాదిరి ఫ్రీగా ఫోన్ లో మాట్లాడ లేక పోతున్నారు.
అయితే.. వాట్సాప్ కాల్ లేదంటే టెలిగ్రామ్ కాల్ చేస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకు వేసి గూగుల్ హ్యాంగౌట్ కాల్ చేసేటోళ్లు లేకపోలేదు. ఇదంతా ఎందుకంటే.. చిన్నమాటకు విపరీతార్థాలు తీయటం.. నిమిషాల్లో వైరల్ చేస్తుండటంతో జాగ్రత్తగా ఉంటున్నారు. తాజాగా చెప్పే ఉదంతం కూడా ఆ కోవకే చెందినదిగా చెప్పక తప్పదు. ప్రస్తుతం జరుగుతున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. చాలా విషయాలు బయటకు రావటం లేదు.
దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్ అయినప్పటికీ.. మెజార్టీ విషయంలో తాము అనుకున్నంత భారీగా రావాలని హరీశ్ రావు కోరుకుంటున్నారు. తన అధిక్యతను చాటి చెప్పేలా దుబ్బాక ఫలితం ఉండాలన్నది హరీశ్ ఆలోచనగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే ఆయన తెర మీదా.. తెర వెనుక భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ జరిగే రోజు వరకూ కూడా ప్రధాన మీడియాలలో హరీశ్ బొమ్మ.. విజువల్ డైలీ ప్రసారం చేయాల్సిందేనన్న రిక్వెస్టులు వచ్చాయట.
అదే సమయంలో.. ప్రత్యర్థి పార్టీల నేతల ఫోటోలు వీలైనంతగా వాడొద్దని.. వారి సమాచారాన్ని కూడా అండర్ ప్లే చేయాలన్న సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగానే.. ప్రతి రోజు పత్రికల్లో హరీశ్ వ్యాఖ్యలు.. ఆయన యాక్టివిటీస్ హైలెట్ అవుతున్నట్లుగా కాంగ్రెస్.. బీజేపీలకు చెందిన అంశాలేమీ పెద్దగా కనిపించటం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితి దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ వరకు ఉంటుందంటున్నారు. డిజిటల్ మీడియా భారీగా పెరిగిన తర్వాత కూడా.. ప్రధాన మీడియాలో తాము మాత్రమే హైలెట్ కావాలన్న హరీశ్ మాటకు ప్రముఖ మీడియా సంస్థలు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. తాజా ఎపిసోడ్ తో అర్థమయ్యేదేమిటంటే..తనదైన టైం రావాలే కానీ హరీశ్ ఎలా అయినా చక్రం తిప్పుతారన్న భావన కలుగక మానదు.