Begin typing your search above and press return to search.

వైరల్: దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాట

By:  Tupaki Desk   |   8 Sept 2021 4:47 PM IST
వైరల్: దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాట
X
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కరోనా మింగేసినా ఆయన గొంతు నుంచి జాలువారిన పాటలు మాత్రం ఇప్పటికీ సంగీత ప్రపంచంలో శ్రోతలను వీనుల విందు చేస్తూనే ఉన్నాయి. ఎస్పీ బాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన వేలాది పాటలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తిండిపోతారు.

ప్రపంచవ్యాప్తంగా ఎస్పీ బాలుకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. నిత్యం ఆయన పాటలను పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ దుబాయ్ షేక్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట పాడిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

1986లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసికల్ సూపర్ హిట్ సినిమా ‘సిరివెన్నెల’. ఈ సినిమాలో ‘విధాత తలపున వికసించినది’ అని సాగే క్లాసిక్ పాట ఇప్పటికీ ఎంతో పాపులర్. ఈ గీతం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ పాటకు దుబాయ్ షేక్ ఫిదా అయిపోయాడు. తెలుగు భాష రాకున్నా ఎంతో కష్టపడి చక్కగా పాట పాడి అందరినీ ఫిదా చేస్తున్నాడు. దుబాయ్ షేర్ కొంచెం తెలుగు పదాలు కష్టమైనా చాలా స్పష్టంగా పాడి ఔరా అనిపించాడు.

దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాడిన పాట ఇప్పుడు ‘టిక్ టాక్’ వీడియోగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. తెలుగు వాళ్లు దీన్ని వాట్సాప్, ఫేస్ బుక్ లలో తెగ షేర్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు.

వీడియోను కింద చూడొచ్చు.