Begin typing your search above and press return to search.

ఎంట్రీలోనే దుమ్ము రేపిన దుబాయ్ కాయిన్..

By:  Tupaki Desk   |   30 May 2021 10:00 AM IST
ఎంట్రీలోనే దుమ్ము రేపిన దుబాయ్ కాయిన్..
X
ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారిన క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి తాజాగా మరో కాయిన్ ఎంట్రీ ఇచ్చింది. రావటం రావటమే దుమ్ము రేపటమే కాదు.. తొలి రోజునే భారీగా విలువ పెరిగి లాభాల్ని తీసుకొచ్చింది. దుబాయ్ కాయిన్ గా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క్రిప్టో కరెన్సీని సింఫుల్ గా డిబిక్స్ (DBIX) పిలుస్తున్నారు. ప్రపంచంలోని కొన్ని క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలలో దీని ట్రేడింగ్ ప్రారంభమైంది. డిబిక్స్ దెబ్బకు మార్కెట్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

ఎందుకంటే.. ఎంట్రీ ఇచ్చిన కాసేపటికే దీని ధర భారీగా పెరిగిపోవటమే ఇందుకు కారణం. ట్రేడింగ్ మొదలైన కాసేపటికే దీని విలువ వెయ్యి శాతానికిపైనే పెరిగింది. కాయిన్ బేస్.. క్రిప్టో డాట్ కామ్ ఎక్స్ఛేంజీలలో దుబాయ్ కాయిన్ ట్రేడింగ్ షురూ అయ్యింది. 0.17 డాలర్ల వద్ద మొదలైన దుబాయ్ కాయిన్.. ప్రస్తుతం 1.13 డాలర్లుగా మారింది. ఇప్పటివరకు 4.8 మిలియన్ డాలర్లుగా దీని విలువ చెబుతున్నారు. 42.7 మిలియన్లు ట్రేడ్ అయ్యాయి.

ప్రస్తుతం దుబాయ్ కాయిన్ ధర మన రూపాయిల్లో చూస్తే.. రూ.82.3 వద్ద ట్రేడ్ అవుతోంది. దీన్ని పబ్లిక్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా దీని ట్రేడింగ్ మొదలు పెట్టారు. దీన్ని యూఏఈ సంస్థ అరేబియన్ చెన్ టెక్నాలజీ దీన్నీ ప్రారంభించింది. దుబాయ్ కాయిన్ త్వరలోనే ఆన్ లైన్.. ఆఫ్ లైన్ లో వస్తువల్ని.. వస్తు సేవల్ని కొనుగోలు చేయటానికి వీలవుతుందని చెబుతున్నారు. అయితే.. ఈ కాయిన్ మీద దుబాయ్ ప్రభుత్వమైతే స్పష్టత ఇచ్చింది. తమ ప్రభుత్వం దుబాయ్ కాయిన్ ను ప్రోత్సహించటం లేదని స్పష్టం చేస్తోంది. ఏమైనా.. ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న క్రిప్టో కరెన్సీకి ఏ మాత్రం తీసి పోని రీతిలో దుబాయ్ కాయిన్ మరింత దుమ్ము రేపటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.