Begin typing your search above and press return to search.

బాబు కాన్వాయ్‌ కు చెమ‌ట‌లు ప‌ట్టించాడు

By:  Tupaki Desk   |   21 July 2017 4:25 AM GMT
బాబు కాన్వాయ్‌ కు చెమ‌ట‌లు ప‌ట్టించాడు
X
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌యాణిస్తున్న వాహ‌న శ్రేణికి చెమ‌ట‌లు ప‌ట్టించాడో మందుబాబు. శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి గ‌న్న‌వ‌రం వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్‌ కు వెళుతున్న చంద్ర‌బాబు కాన్వాయ్ కు అడ్డుగా వ‌చ్చిన ఒక మందుబాబు దెబ్బ‌కు బాబు భ‌ద్ర‌తా సిబ్బంది తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

గురువారం శంషాబాద్ విమానాశ్ర‌యానికి బాబు భ‌ద్ర‌తా సిబ్బందితోకూడిన కాన్వాయ్ లో బాబు బ‌య‌లుదేరారు. వారి వాహ‌న‌శ్రేని ఆర్డీఐఏ పోలీస్ స్టేష‌న్ కు దగ్గ‌ర‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ఒక మందుబాబు ఉన్న‌ట్లుండి రోడ్డు మీద‌కు వ‌చ్చాడు. అత‌డ్ని చూసిన అక్క‌డి స్థానికులు పెద్ద ఎత్తున ఆరిచారు. అదే స‌మ‌యంలో వాహ‌న డ్రైవ‌ర్ సైతం అప్ర‌మ‌త్తం కావ‌టంతో పెను ప్ర‌మాదం తృటిలో త‌ప్పింది.

బాబు కాన్వాయ్ వెళ్లిపోయిన త‌ర్వాత స్థానిక పోలీసులు స‌ద‌రు వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అత‌గాడు మ‌ద్యం మ‌త్తులోనే అలాంటి ప‌ని చేశాడే త‌ప్పించి.. మ‌రెలాంటి కార‌ణం లేద‌ని తెలీయ‌టం.. మ‌త్తులో ఉండ‌టంతో అత‌డ్ని హెచ్చ‌రించి విడిచిపెట్టారు. ఏది ఏమైనా.. బాబు భ‌ద్ర‌తా సిబ్బందికి కొన్ని క్ష‌ణాల పాటు మందుబాబు చెమ‌ట‌లు ప‌ట్టించార‌ని చెప్పక త‌ప్ప‌దు.