Begin typing your search above and press return to search.

మద్యం మత్తులో కోడిని పీక్కుతిన్నాడు..

By:  Tupaki Desk   |   1 Aug 2018 7:11 AM GMT
మద్యం మత్తులో కోడిని పీక్కుతిన్నాడు..
X
ఒక పెగ్గు - రెండు పెగ్గులు.. అప్పటివరకూ కంట్రోలే.. కానీ క్వాటర్ - ఆఫ్ - ఫుల్లు బాటిల్ తాగాక ఇక కంట్రోల్ ఎక్కడుంటుంది. మద్యం మత్తులో చేసేది మనకు ఏదీ గుర్తుండదు.. మత్తు దిగాక కానీ ఆ అనర్థాలపై తిడుతుంటే అర్థం కాదు.. మద్యం తాగాక మందు బాబులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.. తాజాగా ఫుల్లుగా తాగిన ఓ యువకుడు చేసిన పని సంచలనంగా మారింది..

మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు పచ్చి కోడినే పీక్కుతిన్న ఘటన మంగళవారం వరంగల్ పూర్వపు జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనని వీడియో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అది కాస్తా వైరల్‌ అయింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కోడిని ఖరీదు చేసి తీసుకెళ్తున్నారు. మత్తులో నడవలేని స్థితిలో ఆర్వోబీ సమీపంలో పడిపోయారు. ఇద్దరిలో ఓ యువకుడు చేతిలో ఉన్న కోడిని చంపి పచ్చిదే పీక్కుతిన్నాడు. దీన్ని కొందరు అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

యువకుడికి మత్తు దిగాక కానీ అర్థం కాలేదు.. తాను పచ్చి కోడిని తిన్నానని.. తాగితే ఇలాంటి అనర్థాలు కూడా చేస్తారా అని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.