Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో మళ్లి డ్రగ్స్ కలకలం..!

By:  Tupaki Desk   |   23 Oct 2021 8:00 PM IST
హైదరాబాద్ లో మళ్లి డ్రగ్స్ కలకలం..!
X
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ , గంజాయి అక్రమ రవాణా అంశాలు రాజకీయాలను వేడెక్కీస్తూన్నాయి. ప్రతి రోజూ డ్రగ్స్ , నిషేధిత మత్తు పదార్థాలా సరఫరాకు సంబంధించిన వార్త ఎక్కడో ఒకచోట బయటకు వస్తూనే ఉంది. ఏపీలో ఇప్పటికే రాజకీయ పార్టీల బ్లడ్ బాయిలింగ్ పాయింట్ కు చేరిపోయింది. తెలంగాణలో ఆ రాష్ట్ర సీఎం ఇప్పటికే డ్రగ్స్ పై రివ్యూ చేసి… పోలీసులను హై అలర్ట్ చేసేశారు. ఈ మీటింగ్ జరిగిన గంటల సమయంలో నే హైదరాబాద్ లో డ్రగ్స్ కు సంబంధించిన తాజా వార్త కలకలం రేపుతోంది.హైదరాబాద్ లో 3 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు.

ఓ కొరియర్ సంస్థ ఆఫీస్ లో 3 కిలోల డ్రగ్స్ పార్సిల్ ను పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో కొరియర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు ఎన్సీబీ అధికారులు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు చేసిన పార్సిల్ లో ఈ 3 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకి చెందిన వ్యక్తి ఈ పార్సిల్ ను ఆస్ట్రేలియాకు పంపించాలని ప్లాన్ వేసినట్టు గుర్తించారు. కొరియర్ ఆఫీస్ లో ఇచ్చిన డీటెయిల్స్ తో కూపీ లాగిన ఎన్ బి ఆఫీసర్స్, చెన్నైకి వెళ్లి వెతికారు. ఇచ్చిన అడ్రస్ లో ఆ వ్యక్తి దొరకలేదు. ఫేక్ ఐడీ కార్డు ఇచ్చినట్టు తెల్సుకున్నారు. రెండు రోజుల పాటు , చెన్నైలోనే మకాం వేసి పార్సిల్ ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. చెన్నైలో అరెస్ట్ అయిన వ్యక్తి ఇచ్చిన డేటా ఆధారంగా…. వైజాగ్ లో ఒకరిని.. హైదరాబాద్ లో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ముగ్గురు బిహారీలని అధికారులు గుర్తించారు. దీంతో తమిళనాడు, బిహార్ రాష్ట్రాలకు చెందిన డ్రగ్ సప్లయర్స్ తెలుగు రాష్ట్రాల్లోని నగరాలే కేంద్రంగా ఆస్ట్రేలియా సహా విదేశాలకు డ్రగ్స్ అక్రమంగా సప్లై చేస్తున్నట్టు అధికారులు సమాచారం సేకరించారు. NCB అధికారుల సమాచారంతో పోలీసులు నిఘాను మరింత పటిష్టం చేసినట్టు తెలుస్తోంది.