Begin typing your search above and press return to search.

చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ ఉంటే జైలుకే

By:  Tupaki Desk   |   26 Feb 2018 10:44 PM IST
చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ ఉంటే జైలుకే
X
న‌గ‌ర పోలీసుల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా అదే స్థాయిలో మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. రూల్స్ బ్రేక్ చేసి మ‌రి పోలీసులు వాహ‌న‌దారుల్ని జైలుకు త‌ర‌లిస్తున్నారు. పోలీసులు చేసే ప‌ని సిల్లీగా ఉందంటూ మ‌ర్శిస్తున్నారు. అయినా స‌రే వారు చేసే ప‌ని వ‌ల్ల ప్రాణాలు నిల‌బ‌డుతాయ‌ని మ‌రికొంద‌రంటున్నారు. ఇంత‌కీ పోలీసులు ఏం రూల్స్ బ్రేక్ చేస్తున్నారు..? వాళ్లు చేస్తున్న ఆ సిల్లీ ప‌నేంటో తెలుసుకునేముందు

ఉత్తర్ ప్ర‌దేశ్ హ‌పూర్ లో విషాదం జ‌రిగింది. ఆదివారం అర్ధ‌రాత్రి ప‌ట్టాలు దాటుతుండ‌గా ఆరుగురు మైనర్లు మృతి చెందారు. 14నుంచి 16వ‌య‌సు మ‌ధ్య‌లో ఉండే బాధితులు డైలీ వేజ్ లేబ‌ర్ల‌ని స్థానికులు చెబుతున్నారు. అయితే వీరు హ‌పూర్ నుంచి హైద‌రాబాద్ కు పెయింటింగ్ వేసేందుకు బ‌య‌లు దేరారు. హ‌పూర్ స్టేష‌న్ లో అర్ధ‌రాత్రి ప‌ట్టాలు దాటుతుండగా అట్నుంచి వ‌స్తున్న ఓ ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ఆ మైన‌ర్లు అక్క‌డిక‌క్కేడే మృతిచెందారు. ఈ మృతిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారా..? ఒకేసారి ఆరుగురు ఎలా మృతి చెందారు..? మృతి కార‌ణాలు ఏంటి..? అని తెలుసుకునేందుకు పోలీసులు ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతాల్లో క్లూ ఏమైనా దొర‌కుతుందేమోన‌ని అన్వేష‌ణ ప్రారంభించారు. ఈ అన్వేష‌ణ‌లో పోలీసుల‌కు హియ‌ర్ ఫోన్స్ ల‌భ్య‌మయ్యాయి. దీంతో ఆ మైన‌ర్లు చ‌నిపోయింది హియ‌ర్ ఫోన్ల వ‌ల్లేన‌ని స్ప‌ష్టం చేశారు.

అంతేకాదు రైలు ప్ర‌మాదంపై ప్ర‌భుత్వ యంత్రాంగం దిగివ‌చ్చింది. స్థానిక జిల్లా మేజిస్ట్రేట్ కృష్ణ కరుణేష్ - పోలీస్ సూపరింటెండెంట్ హేమంత్ కుటియాల్ ప్ర‌మాదం జరిగిన ప్రాంతంలో విచార‌ణ చేప‌ట్టారు. వీరుకూడా హియ‌ర్ ఫోన్ల వ‌ల్లే ఆ మైన‌ర్లు మృతి చెందార‌ని అన్నారు. ఆదివారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఆ మైన‌ర్లు హెడ్ సెట్ పెట్టుకొని పాట‌లు వింటూ ప‌ట్టాలు దాటే ప్ర‌య‌త్నం చేశారని స్థానికులు చెబుతున్నారు. హియ‌ర్ ఫోన్ల వ‌ల్ల వ‌చ్చే రైలును గుర్తించ‌లేద‌ని దీంతో ప్రాణాలు పోయాయని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక హైద‌రాబాద్ విష‌యానికొస్తే న‌గ‌రంలో డ్రైవింగ్ చేసేవారిపై దృష్టిసారించిన పోలీసులు దొరికిన‌వాళ్ల‌ని దొరికిన‌ట్లు జైలుకు త‌ర‌లిస్తున్నారు.

న‌గ‌రంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేప‌డ‌తుంటారు. ఆ డ్రంకన్ డ్రైవ్ లో లైసెన్స్ స‌రిగాలేద‌ని, హెల్మెట్ లేద‌ని , మద్యం సేవించి డ్రైవ్ చేస్తున్నారంటూ వాహ‌న‌దారుల‌కు చుక్క‌లు చూపిస్తుంటారు.

ఇప్పుడు కొత్త‌గా రూల్స్ బ్రేక్ చేస్తున్నార‌ని వాహ‌నదారులు వాపోతున్నా స‌రే... పోలీసులు చెవిలో హియ‌ర్ ఫోన్స్ ఉన్నా అరెస్ట్ చేసేందుకు వెన‌కాడటంలేదు. చెవిలో హియ‌ర్ ఫోన్స్ పాట‌లు వినకున్నా వారికి సంబంధంలేదు. హియ‌ర్ ఫోన్స్ పెట్టుకున్నా. బండిపై స్కిక్క‌ర్లు క‌నిపించినా అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లిస్తారు. ఇప్ప‌టికే న‌గ‌రంలో కొన్ని ప్రాంతాల్లో తినిఖీలు చేసిన పోలీసులు 19 మంది వాహ‌న‌దారుల‌పై కేసు న‌మోదు చేసి ఒక‌రోజు జైలు శిక్ష‌ను విధించారు.

వారిలో ఎక్కువ మంది హియ‌ర్స్ ఫోన్స్ ను చెవిలో పెట్టుకొని డ్రైవ్ చేయ‌డం వ‌ల్ల అరెస్ట్ చేశార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇయ‌ర్ ఫోన్ పెట్టుకొని వాహ‌నాన్ని న‌డ‌ప‌కూడ‌దా అని ఎదురు ప్ర‌శ్నిస్తుంటే ..పోలీసులు చేసే ప‌ని చాలా సిల్లీగా ఉందంటూ తిట్టిపోస్తున్నారు.

ఏది ఏమైనా పోలీసులు చేసే ప‌ని బాగుంద‌ని ..హియ‌ర్స్ ఫోన్స్ వ‌ల్ల ప్రాణాలు పోతున్న సంఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయ‌ని అంటున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణే యూపి లో రైల్వే ప్ర‌మాద ఘ‌ట‌నని గుర్తు చేస్తున్నారు.

ఎనీ హౌ హియ‌ర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్ చేసే అల‌వాటు ఉంటే వెంట‌నే మార్చుకోండి లేదంటే ఒక‌రోజు జైలు శిక్ష‌ప‌డడం ఖాయ‌మ‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.