Begin typing your search above and press return to search.
ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్..కువైట్ సంచలన నిర్ణయం!
By: Tupaki Desk | 7 Oct 2021 5:00 PM ISTవలసదారులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయమై గల్ఫ్ దేశమైన కువైట్ మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తోంది. అంతర్గత మంత్రిత్వశాఖ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైజల్ అల్ నవాఫ్ తాజాగా ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశంలో ట్రాఫిక్ పరిస్థితిపై సమీక్షించారు. అలాగే ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీని నిలిపివేసే ప్రతిపాదనపై కూడా సంబంధిత అధికారులతో మాట్లాడారు. రోడ్లపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రద్దీని తగ్గించే క్రమంలో నివాసితులకు డ్రైవింగ్ లైసెన్స్ జారీని నిలిపివేయాలని కువైత్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అక్కడి ప్రముఖ ఓ న్యూస్ ఏజెన్సీ తెలియజేసింది.
అధికారులతో సమావేశమైన షేక్ ఫైజల్ ఈ విషయమై కూలంకషంగా చర్చించిన తర్వాత తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీనిపై అధ్యయనం నిర్వహించి నివాసితులకు డ్రైవింగ్ లైసెన్స్ లు మంజూరుకు కొత్త మెకానిజం అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారుల బృందాన్ని ఆదేశించారు. అంతేగాక ఇటీవల డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేసిన నివాసితుల సంఖ్య, ట్రాఫిక్ రద్దీపై దాని ప్రభావం విషయమై అధ్యయనం నిర్వహించాలని బృందానికి షేక్ ఫైజల్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా అరబిక్ స్కూల్స్ ప్రారంభమైన నేపథ్యంలో దేశంలో ట్రాఫిక్ పరిస్థితిపై సమీక్షించడానికి తాజాగా ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే వలసదారులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయమై చర్చించారు.
అంతర్గత మంత్రిత్వశాఖ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ షేక్ ఫైజల్ అల్ నవాఫ్, ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్సుల జారీని పరిమితం చేయడానికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చే ఆదివారం నుంచి అరబిక్ స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంశాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గల్ఫ్ దేశం కువైత్ లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత సులువు కాదని తాజాగా వెలువడిన ఓ నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో ప్రపంచంలోనే కువైత్ ఆరో స్థానంలో నిలిచింది. కువైత్ స్కోర్ 4.05/10గా నమోదైంది. ఇక కువైత్‌లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస వయసు 18 ఏళ్లు. అలాగే ఇతర కొన్ని విషయాలు కూడా ఆ దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. వాటిలో ముఖ్యమైంది డ్రైవింగ్ టెస్టు రుసుము. కువైత్‌లో డ్రైవింగ్ టెస్టు ఫీజు వచ్చేసి సుమారు రూ. 5,200 వరకు ఉంటుంది. దీనికితోడు ప్రాక్టికల్ డ్రైవింగ్ ఎగ్జామ్, వైద్య పరీక్షలు అదనం. అందుకే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అంత ఈజీగా దొరకదని తెలుస్తోంది.
కాగా, డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కఠిన నిబంధనలు ఉన్న ఆ దేశంలో వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రతియేటా పెరుగుతున్నాయి. తాజాగా వెలువడిన అధికారిక గణాంకాల ప్రకారం 2018లో 2,203,723 వాహనాలు రిజిస్టర్ అయితే, 2019లో ఈ సంఖ్య 2,368,680గా ఉంది. ఇదిలాఉంటే.. కువైత్ కంటే మరో గల్ఫ్ దేశం బహ్రెయిన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా కఠినతరం అని సమాచారం. ఈ విషయంలో బహ్రెయిన్ 3.62/10 స్కోర్‌తో ప్రపంచంలోనే నాల్గో స్థానంలో నిలిచింది. క్రొయేషియా(1.96), బ్రేజిల్(3.21), హంగేరీ(3.59) బహ్రెయిన్ కంటే ముందు ఉన్నాయి. ఇక ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ దొరికే దేశాల్లో మెక్సికో(9.48/10), ఖతార్(7.39), లాట్వియా(7.03), అమెరికా(6.95), కెనడా(6.93) ఉన్నాయి.