Begin typing your search above and press return to search.

మారుతీరావు ఉదంతంలో కారు డ్రైవర్ భాగమెంత?

By:  Tupaki Desk   |   10 March 2020 9:10 AM GMT
మారుతీరావు ఉదంతంలో కారు డ్రైవర్ భాగమెంత?
X
మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసు లో ప్రధాన నిందుతుడు , అమృత కన్నతండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ కేసు ,మారుతీరావు మృతితో మరో మలుపు తిరిగింది. ఇక ఈ కేసు విచారణని సైఫాబాద్‌ పోలీసులు వేగవంతం చేసారు. విషం తాగడం వల్లే మారుతీరావు మృతిచెందినట్లు ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్‌ వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే , మారుతీరావు ఏ విషం తాగాడన్నది విస్రా నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది.

కాగా, ఆ నివేదిక వచ్చేలోపు ..అసలు మారుతీరావు విషాన్ని ఎక్కడ కొన్నారు? ఎక్కడ తాగారు? అనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే , మారుతీరావు శవమై కనిపించిన వైశ్యాభవన్‌ రూమ్‌ నెం.306లో కానీ, ఆయన కారులో ఎలాంటి విషం సీసాలు లభించకపోవడంతో దీన్ని ఛేదించడం కొంచెం కష్టమౌతుంది. అయితే , దీనిపై మారుతీరావు కారు డ్రైవర్ ని విచారించారు. ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శనివారం మిర్యాలగూడ నుంచి తన కారులో డ్రైవర్‌ రాజేష్‌ తో కలిసి మారుతీరావు బయలు దేరారు. అయితే , మార్గమధ్యం లో ఓ ఎరువులు, పురుగు మందుల దుకాణం వద్ద కారు ఆపాలని డ్రైవర్‌ తో చెప్పారని, ఒక దుకాణం ముందు కారు ఆపగానే ఆ దుకాణంలోకి వెళ్లిన ఆయన కొద్దిసేపటి తర్వాత వచ్చి వచ్చారని , ఆ తరువాత నేరుగా కారులో ఖైరతాబాద్‌ లోని ఆర్య వైశ్య భవన్‌ కు చేరుకున్నారు. ఆ తరువాత శనివారం రాత్రి డ్రైవర్‌ తో గారెలు తెప్పించుకున్న మారుతీరావు వాటిలో ఆ దుకాణంలో కొన్న విషాన్ని కలుపుకుని తిని ఉంటారని అంచనా వేస్తున్నారు. డ్రైవర్ రాజేష్‌ ని చెప్పిన దాన్ని బట్టి చూస్తే .. కారు మార్గమధ్యంలో ఎరువుల దుకాణం వద్ద ఆపి , పురుగు మందు లేదా గుళికలు ఖరీదు చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే, విస్రా నివేదిక వచ్చి తర్వాతే విషం ఏమిటన్నది స్పష్టంగా తెలుస్తుందని కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారులు చెప్తున్నారు.

అలాగే , మారుతీరావు కాల్‌ డిటైల్స్‌ ను పరిశీలిస్తున్న పోలీసులు శనివారం రాత్రి 8.22 గంటలకు ఆయన ఆఖరి ఫోన్‌ కాల్‌ చేశారని, మల్లేపల్లిలో ఉండే తన న్యాయవాది వెంకట సుబ్బారెడ్డితో మాట్లాడినట్లు పోలిసుల విచారణలో తేలింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆర్య వైశ్య భవన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ నీ కూడా పరిశీలిస్తున్నారు.