Begin typing your search above and press return to search.

కరోనా తగ్గిపోతుందని అక్కడ బ్లీచింగ్ పౌడర్ తాగుతున్నారట .. !

By:  Tupaki Desk   |   28 Aug 2020 4:40 PM IST
కరోనా తగ్గిపోతుందని అక్కడ బ్లీచింగ్ పౌడర్ తాగుతున్నారట .. !
X
కరోనా మహమ్మారి రోజురోజుకి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతూ , అందరిని భయపెడుతుంది. కరోనా వెలుగులోకి వచ్చిన రోజులు , నెలలు గడుస్తున్నా కూడా సరైన వ్యాక్సిన్ రాకపోవడంతో దీన్ని అరికట్టలేకపోతున్నారు. కరోనా సోకకుండా ప్రభుత్వాధికారులు, ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు వేడి నీళ్లు తాగుతూ, కరోనా ‌ నిబంధనలు పాటిస్తుంటే.. ప్రభుత్వ యంత్రాంగం అనుమానిత ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతూ కరోనాను సంహరించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ బ్లీచింగ్‌ పౌడర్‌ కరోనా వైరస్ ‌ను చంపుతుంది కదా అని నార్త్‌ టెక్సాస్లో కొందరు బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపిన ద్రవాన్ని తాగేస్తున్నారట. కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయితే వారి ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ సిబ్బంది బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో బ్లీచింగ్‌ పౌడర్‌ ద్రవం తాగడం వల్ల శరీరంలోకి ప్రవేశించిన కరోనా కూడా నశిస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారట. అక్కడి అమాయక ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మి బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపిన ద్రవం తాగుతున్నారు.

అనంతరం అస్వస్థతకు గురవుతున్నారు. ఇలా ఆగస్టు నెలలో ఇప్పటి వరకు దాదాపు 50 మంది బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపిన ద్రవం తాగి అస్వస్థతకు గురయ్యారట. దీంతో ఇలాంటి తప్పుడు సమాచారాలను నమ్మొద్దంటూ టెక్సాస్‌ పాయిజన్‌ సెంటర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. బ్లీచింగ్‌ పౌడర్‌ ద్రవం తాగితే వాంతులు, విరేచనాలు, రక్తప్రసరణలో సమస్యలు, కాలేయం దెబ్బతినడం వంటివి జరుగుతాయని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ ‌(ఎఫ్‌ డీఏ) వెల్లడించిందని తెలిపింది. మీడియా, ఇంటర్నెట్ ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. తమ బంధువులు, చుట్టు పక్కల వారు చెప్పారని, కొందరు బ్లీచింగ్ తాగేస్తున్నారు. వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరం. ఇది మంచి ఐడియా కాదు. బ్లీచ్ కరోనా వైరస్ ను చంపలేదు. కనీసం నిరోధించ లేదు కూడా. దయచేసి బ్లీచ్ తాగొద్దు అని అధికారులు ప్రజలకి విన్నపం చేస్తున్నారు.