Begin typing your search above and press return to search.
లాక్‌డౌన్‌లో మద్యం మానేస్తేనే ఇంట్లో ప్రశాంతత
By: Tupaki Desk | 16 April 2020 11:45 AM ISTప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్ విధించాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఈ లాక్‌డౌన్ అనేది కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంటిలో సందడి వాతావరణం ఏర్పడింది. ఎంత ఉన్నా ఎన్నాళ్లని ఇంట్లోనే ఉంటామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కోపం, అసహనం పెరుగుతోంది. దీంతో ఇంటిలో విబేధాలు ఏర్పడి గొడవలు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్నిచోట్ల తీవ్రమవుతుండడం ఆందోళన కలిగించే పరిణామంగా భావించాలి. అయితే ఈ సమయంలో కూడా మద్యం సేవించడం తగదని.. అది కుటుంబంలో మరింత గొడవలకు దారి తీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. లాక్‌డౌన్ మద్యం సేవించవద్దని కోరింది.
అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కూడా మద్యం సేవించవద్దని సూచించింది. ఎందుకంటే మద్యం తాగితే రోగ నిరోధక శక్తి తగ్గుతుందని.. ఆ శక్తి తగ్గితే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వివరించింది. కుటుంబం కోసం, మీ ఆరోగ్యం కోసం ప్రస్తుతం మద్యం మానేయండి డబ్ల్యూహెచ్ఓ కోరుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలకు కూడా సలహా ఇచ్చింది. ఈ సమయంలో ప్రజలకు మద్యం అందుబాటులో ఉండకుండా చేయాలని, మద్యం నియంత్రించాలని సూచనలు చేసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. మార్గదర్శకాలు విడుదల చేసి ప్రజలతో పాటు ప్రభుత్వాలకు సూచనలు చేసింది.