Begin typing your search above and press return to search.
పోలీస్ కే ముద్దిచ్చాడు.. తర్వాత ఏమైందంటే.?
By: Tupaki Desk | 29 July 2019 3:18 PM ISTఅసలే ఆషాఢం.. పైగా బోనాల పండుగ.. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విందులు, వినోదాలు, పోచమ్మకు బోనాలు, అమ్మవారికి పొట్టేళ్ల బలితో మద్యం మత్తులో జనాలు తులతూగుతున్నారు. డప్పు చప్పుళ్లకు యువత మద్యం తాగి డ్యాన్సులు చేస్తూ ఊగిపోతున్నారు.
తాజాగా బోనాల పండుగలో డ్యాన్స్ చేస్తూ మద్యం మత్తులోని ఒక యువకుడు ఏకంగా ఒక ఎస్సై స్థాయి పోలీసుకు ముద్దు పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్న సమూహం పక్కనుంచి పోలీస్ ఆఫీసర్ వెళ్తుండగా.. ఈ మందుబాబు డ్యాన్స్ చేస్తూ పోలీసును చూసి అతడి దగ్గరకు వెళ్లి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. గట్టిగా కౌగిలించుకొని ముద్దిచ్చిన మందుబాబు చేష్టలకు ఖిన్నుడైన పోలీసు వెంటనే లాగి ఒక్కటి చెంప మీద ఇచ్చాడు.
దీంతో మందు బాబు అలానే డ్యాన్స్ చేస్తూ ఆ సమూహం వెనుకాలకు వెళ్లిపోయాడు. పోలీసు మాత్రం అతడిని పట్టుకునేందుకు వెళ్లి ఊరుకొని తిరిగి వెళ్లిపోయాడు. పోలీస్ కే ముద్దు ఇచ్చిన మందుబాబు సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరికీ నవ్వులు పూయిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన మర్యాదపూర్వక వ్యవహారశైలితో యూత్ కు పోలీసులంటే మునుపటి భయం పోయిందని... ఏకంగా ముద్దులు పెట్టుకునే స్థాయికి పరిస్థితి చేరిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.