Begin typing your search above and press return to search.
ఆవు మూత్రంపై మరో నాయకుడిది అదేమాట.. నమ్మనోళ్లు గాడిదలంట
By: Tupaki Desk | 20 July 2020 2:00 PM ISTమహమ్మారి వైరస్‌పై రాజకీయ నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. తమ అజ్ఞానాన్ని ప్రజల ముందు పంచుకుంటున్నారు. దానికి బీజేపీ నాయకులే ఉదాహరణగా నిలుస్తున్నారు. గతంలో బడా బడా కాషాయ పార్టీ నాయకులు ఈ వైరస్ విషయంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అందులో వారు చేసిన ప్రధాన సూత్రం ఆవు మూత్రం తాగితే మహమ్మారి వైరస్ సోకదని. ఈ సూత్రాన్ని బీజేపీ నాయకులు పాటిస్తున్నారో లేదో కానీ ప్రజలకు మాత్రం చెబుతున్నారు. తాజాగా ఇదే విషయమై కమలం పార్టీ ఓ రాష్ట్ర అధ్యక్షుడు అదే ముచ్చట చెప్పాడు.. ఇంకొంత రెచ్చిపోయి నేను ఆవుల గురించి మాట్లాడితే చాలా మందికి ఏదో విపరీతంగా అనిపిస్తుంటుంది. అటువంటివారు గాడిదలు..ఆవు విలువను ఆ గాడిదలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు..అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయనే బీజేపీ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్.
గోమూత్రం సేవిస్తే వైరస్ రమ్మన్నా రాదు అంటూ పేర్కొన్నారు. మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆవు మూత్రం తాగాలని సూచించాడు. వైరస్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో రోగ నిరోధక శక్తని పెంచడానికి గోమూత్రం తాగాలని ఆ రాష్ట్రంలోని దుర్గాపూర్ నగరంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఆవుల గురించి మాట్లాడితే చాలా మందికి ఏదో విపరీతంగా అనిపిస్తుంటుందని.. అలాంటి వారిపై విరుచుకుపడ్డారు. ఇది భారతదేశం, శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్రమైనభూమి … ఇక్కడ ఆవులను పూజిస్తాం. ఆరాధిస్తాం..సంరక్షిస్తామని తెలిపారు. దీంతో పాటు ఆవు గొప్పతనంపై ఓ ప్రసంగమే చేశాడు.
ఆవు ఒక జంతువు మాత్రమే కాదు అది ఆరోగ్యప్రదాయిని.. ఆరోగ్యంగా ఉండటానికి ఆవు మూత్రం ఉందని తెలిపారు. మద్యం తాగే వారు, ఆవు విలువను ఎలా అర్థం చేసుకుంటారంటూ ప్రశ్నించారు. ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం దిలీప్ ఘోష్‌కు అలవాటే. 2019 నవంబర్‌లో ఆవు పాలలో బంగారం ఉందని దిలీప్ తెలిపారు. ఇది తీవ్ర దుమారం రేపింది. దీనిపై ఓ వ్యక్తి బ్యాంకు వద్దకు ఓ ఆవును తీసుకెళ్లి ఇది నా ఆవు..దీని పాలల్లో బంగారం ఉంటుందని ఓ నాయకుడు చెప్పారు. దీంతో నా ఆవును మీ బ్యాంకులో తాకట్టు పెట్టుకుని తనకు డబ్బులివ్వాలని కోరడం సంచలనం రేపింది.