Begin typing your search above and press return to search.

నోటిఫికేషన్ లు లేవు.. పిచ్చిలేస్తోంది.. కేసీఆర్ కారణమంటూ సూసైడ్

By:  Tupaki Desk   |   26 Jan 2022 5:07 AM GMT
నోటిఫికేషన్ లు లేవు.. పిచ్చిలేస్తోంది.. కేసీఆర్ కారణమంటూ సూసైడ్
X
చదువుకున్నాడు. మంచి ఉద్యోగం కోసం కలగన్నాడు. అందుకోసం శ్రమించాడు. తన చిన్న చిన్ననాటి ఎస్ఐ ఉద్యోగం సొంతం చేసుకోవటమే లక్ష్యమనుకున్నాడు. అన్నింటికి సిద్ధమయ్యాడు.కానీ.. ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు. దీంతో.. నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి.. ఎదురుచూసి.. విసిగిపోయిన అతడు తన వాట్సాప్ గ్రూప్ లో "నోటిఫికేషన్ లు లేవు. పిచ్చిలేస్తోంది కేసీఆర్.. కరోనా కారణం" అని పేర్కొన్నారు. ఎస్ఐ ఉద్యోగం కోసం పరితపించిన 24 ఏళ్ల ముత్యాల సాగర్.. మంగళవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం వద్ద రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

ఎస్ఐ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవటం కోసం రెండున్నరేళ్లుగా శిక్షణ తీసుకుంటున్న అతడు.. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు విడుదల కాకపోవటంతో తీవ్రమైన నిరాశకు గురయ్యాడు. డబ్బుల కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తనకుడబ్బులు పంపే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవటంతో వారిని ఇబ్బంది పెట్టకుడదన్న ఉద్దేశంతోఆత్మహత్య చేసుకున్నాడు.

సాగర్ తండ్రి భద్రయ్య హమాలీగా పని చేస్తుండగా.. అతడి తల్లి కళమ్మ కూలీగా పని చేస్తుంటుంది. సాగర్ కు ఒక అక్కడ ఉంది. రెండేళ్ల క్రితం ఆమెకు పెళ్లి చేశారు. చదువులోచురుగ్గా ఉండే సాగర్.. ఖమ్మంలోనే ఐదేళ్లుగా ఉంటున్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఒక గదిని అద్దెకు తీసుకొని బండి నడిపిస్తున్నాడు. ఉద్యోగాల కోసం ప్రయత్నించినా.. నోటిఫికేషన్లు విడుదల కాకపోవటంతో.. ఖాళీ వేళల్లో క్యాటరింగ్ సర్వీసులకు వెళ్లేవాడు.

ఇటీవల సంక్రాంతికి ఊరికి వెళ్లిన సాగర్.. పండుగ తర్వాత మళ్లీ ఖమ్మం వచ్చేశాడు.పండక్కి వెళ్లినప్పుడు పెళ్లి గురించి ఇంట్లో వాళ్లు అడిగితే..జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడని.. అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వైనం అందరినిక కలిచివేస్తోంది. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు ఇంట్లోని తల్లితో ఫోన్ లో మాట్లాడి.. వారి బాగోగులగురించి తెలుసుకున్నాడు. కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు. సాగర్ సూసైడ్ గురించి తెలిసిన కాంగ్రెస్.. బీజేపీతో సహా వామపక్ష నేతలంతా కలిసి ఆందోళనకు దిగారు. ఉద్యోగనోటిఫికేషన్లు విడుదల చేయాలని నినాదాలు చేశారు. దీంతో సాగర్ ఆత్మహత్య కంటే కూడా.. దీనికి కారణం ప్రభుత్వమేనంటూ విపక్షనేతలు చేసిన డిమాండ్లు వారి ఎజెండాను చెప్పకనే చెప్పినట్లైంది. ఎంత ఎదురుచూసినా రాని ఉద్యోగ నోటిఫికేషన్ ఇలాంటి అమాయకులు తమ ప్రాణాల్ని బలి చేసుకుంటున్నారు.మరి.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తార?