Begin typing your search above and press return to search.

భారత్ కు మరింత ప్రమాదకరంగా డ్రాగన్

By:  Tupaki Desk   |   12 July 2021 1:42 PM IST
భారత్ కు మరింత ప్రమాదకరంగా డ్రాగన్
X
మన దేశానికి డ్రాగన్ దేశం మరింత ప్రమాధకరంగా తయారవ్వబోతోంది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైన్యం ఖాళీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఆఫ్ఘన్ నుండి అమెరికా ఖాళీ చేసేస్తోందో ఆ స్ధానాన్ని చైనా ఆక్రమించుకునేందుకు ఒప్పందం జరిగిపోయింది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఇనుము, రాగి, సహజ వాయువులు, ఇంధన నిల్వలు అపారంగా ఉన్నాయి.

నిరంతరం యుద్ధాలతోనో లేకపోతే అతర్యుద్ధంలోనో ముణిగి ఉన్న కారణంగా ఈ ఖనిజాలు, నిక్షేపాలను తీయాల్సినంత స్ధాయిలో తీయలేదు. ఈ విషయమై బాగా స్టడీచేసిన చైనా వెంటనే ఖనిజాలు, నిక్షేపాలపై కన్నేసింది. దశాబ్దాలుగా చైనాకు ఆప్ఘన్ లోని ఆల్ ఖైదాకు బలమైన బంధముందట. 1990ల్లోనే ఆల్ ఖైదాకు అవసరమైన ఆయుధాలను, నిధులను డ్రాగన్ అందించిదని బీబీసీ ఎప్పుడో బయటపెట్టింది.

అప్పటి నుండి అవసరమైనపుడల్లా ఆల్ ఖైదాకు డ్రాగన్ సాయం చేస్తునే ఉంది. అందుకనే డ్రాగన్-ఆల్ ఖైదా బంధం అంత బలంగా పెనవేసుకుపోయింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే భారత్ అంటే డ్రాగన్ మండిపోతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారత్ లో అల్లకల్లోలం రేపటానికి ప్రయత్నిస్తున్న పాకిస్ధాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆల్ ఖైదా ఫుల్లు సపోర్టుగా ఉంది. అంటే ఇటు చైనాకు అటు ఆల్ ఖైదాకు కూడా భారత్ అంటే మంటే.

ఇలాంటి నేపధ్యంలో ఆప్ఘనిస్ధాన్ లో చైనా కాలుపెట్టిందంటే అది భారత్ కు ముందు ముందు చాలా ఇబ్బందులు తప్పవని అర్ధమైపోతోంది. చైనా ఒకవైపు ఆర్ధికంగా బలోపేతమవుతునే మరోవైపు ఉగ్రవాదులకు కావాల్సినన్ని ఆయుధాలను సరఫరా చేస్తుందనటంలో సందేహంలేదు. ఇటు పాకిస్ధాన్ అటు చైనాతో వేలాది కిలోమీటర్ల సరిహద్దులను ఇండియా పంచుకుంటోంది. ఈ సరిహద్దుల్లో నుండే పై రెండు దేశాలకు చెందిన ఉగ్రవాదులు, తీవ్రవాదులు భారత్ లోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆప్ఘన్ లో చైనా కాలుపెట్టడమంటే మనకు మరింత ప్రమాధమనే చెప్పాలి.