Begin typing your search above and press return to search.
డ్రాగన్ ఫ్రూట్ లాభాల పండు: ఒకసారి వేస్తే 20 ఏళ్ల వరకు దిగుబడి
By: Tupaki Desk | 21 July 2020 3:20 PM ISTసంపన్నులు తినే డ్రాగన్ ఫ్రూట్ ఎన్నో పోషకాలు కలిగి ఉంది. ఈ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మార్కెట్‌లో ఈ పండుకు చాలా డిమాండ్ ఉంది. ఈ పండు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుండగా ఈ పండ్లతోటను నమ్ముకున్న రైతులకు కూడా ఎంతో లాభదాయకం. ఈ పండ్ల తోట సాగు చేస్తే రెండు దశాబ్దాల వరకు బేఫికర్‌గా ఉండవచ్చు. ఒకసారి పంట వేస్తే 20 సంవత్సరాల వరకు దిగుబడిని ఇస్తుంది. మార్కెట్‌లో ఎప్పటికీ దీనికి డిమాండ్ పడింది. ఈ అరుదైన పంటను రైతులు వేసుకుంటే వారికి ఎంతో లాభసాటి. ఔత్సా హిక రైతులు ఈ పండ్లతోట సాగు చేస్తూ అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా పండ్ల తోటలు సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. ఈ పంట విధానం తెలుసుకోండి.
డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. మంచి సేంద్రియ కర్బనంతో కూడిన ఇసుక నేలలు ఈ తోటలకు మరింత అనుకూలం. ఈ పంటకు నీటి అవసరం చాలా తక్కువ. పూత, కాయ సమయాల్లో 3-4 తడులు ఇస్తే చాలు. పెద్దగా శ్రమ లేకుండానే అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ తోటలు వేయాలంటే సిమెంట్/కాంక్రీట్ స్తంభాలను ఎకరానికి 500 వరకు అవసరమవుతాయి.
- ప్రతీ స్తంభానికి నాలుగు వైపులా నాలుగు మొక్కలను నాటాలి.
- స్తంభానికి పైన టైర్/ఇనుప చక్రం ఉంచాలి. ఇది మొక్క నుంచి వచ్చిన కొమ్మలు విరిగిపోకుండా, జారిపోకుండా కాపాడుతుంది.
- ఎకరానికి సుమారుగా 2, 000 మొక్కలు నాటాలి.
- స్తంభానికి నలుదిక్కులా 2 అడుగుల పొడవు, వెడల్పు, అడుగు లోతు గుంతలు తవ్వాలి.
- గుంతకు 25 కిలోల పశువుల ఎరువు, కిలో వేపపిండి వేసి మొక్కలు నాటాలి.
- నేలను బట్టి, సాగు చేసిన రకాలను బట్టి తడులను ఇవ్వాలి. నీరు ఎక్కువైతే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది.
- సంవత్సరంలో రెండుసార్లు (జూన్.. జనవరిలో) పశువుల ఎరువు వేసి సూక్ష్మ పోషకాల మిశ్రమా న్ని పిచికారీ చేయాలి.
- సాధారణంగా డ్రాగన్ మొక్కలు తొలికాపు వచ్చేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది.
- డ్రాగన్ ఫ్రూట్ పూత, కాయ సీజన్ జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు ఉంటుంది.
- పంట పొలంలో విద్యుత్ లైట్లను అమర్చితే వేసవిలో కూడా పంటను పొందవచ్చు.
- ఈ పంట మొత్తం సాగుకు ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
- ఎకరాకు దిగుబడి 6-8 టన్నుల వరకు వస్తుంది. ప్రస్తుత మార్కెట్‌లో డ్రాగన్ ఫ్రూట్ కేజీ ధర రూ.150-200 వరకు ఉంటుంది.