Begin typing your search above and press return to search.

జగన్ దేవుడు.. డాక్టర్ సుధాకర్ సంచలన నిజాలు

By:  Tupaki Desk   |   11 Jun 2020 4:20 PM IST
జగన్ దేవుడు.. డాక్టర్ సుధాకర్ సంచలన నిజాలు
X
నర్సీపట్నంలో ఒంటిపై చొక్కాలు కూడా లేకుండా చేతులు వెనక్కి కట్టి వీడియోల్లో దీనంగా కనిపించిన డాక్టర్ సుధాకర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. అయితే అసలు అప్పుడు ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు.. తాజాగా డాక్టర్ సుధాకర్ ఆ విషయాలు వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వం కరోనా సమయంలో సరైన వసతులు కల్పించడం లేదని సస్పెండైన ఈయన వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది. చివరకు సీబీఐ విచారణ చేస్తోంది. మెంటల్ హాస్పిటల్ నుంచి ఇటీవలే విడుదలై అజ్ఞాత వాసం గడిపిన సుధాకర్ తాజాగా బయటకు వచ్చాడు. తనను బట్టలూడి నర్సీపట్నంలో నానా హంగామా జరగడానికి కారణం ఏంటో తాజాగా సంచలన నిజాలు వెల్లడించారు.

తాజాగా విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కు డాక్టర్ సుధాకర్ వచ్చాడు. కారులోని తన ఏటీఎం కార్డు తీసుకునేందుకు స్టేషన్ కు వచ్చాడు. నర్సీపట్నంలో రోడ్డుపై తనను నగ్నం చేసిన వైనంపై తాజాగా మాట్లాడారు.

తాను నర్సీపట్నంలో కారులో వస్తుండగా కొంతమది రెచ్చగొట్టారని.. సస్పెండైన డాక్టర్ అని అవమానించారని.. మాటామాట పెరిగి వాగ్వాదం జరిగిందని.. కొందరు రౌడీలు తన చొక్కా విప్పి కొట్టారని డాక్టర్ సుధాకర్ పేర్కొన్నారు. పోలీసులు తనను కొట్టలేదని వివరించారు. తాను తాగి అల్లరిచేస్తున్నానని అక్కడి వాళ్లు చెప్పడంతో పోలీసులు తనను స్టేషన్ కి తీసుకెళ్లారని..డ్రంకన్ డ్రైవ్ టెస్టు కూడా చేయలేదని తెలిపారు.

నర్నీపట్నం ఆసుపత్రిలో కుట్ర జరుగుతోందని.. తనను డిస్మిస్ చేయాలని కొంతమంది ప్లాన్ చేశారని డాక్టర్ సుధాకర్ తెలిపారు. సీఎం జగన్ దేవుడు అని.. వైఎస్ఆర్ అంటే తనకు చాలా ఇష్టమని.. కేసులు ఉపసంహరించుకుంటానని.. తనను డాక్టర్ గా తీసుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని కోరారు. వాలంటరీ రిటైర్ మెంట్ ను మంచి డాక్టర్ గా క్లీన్ చిట్ తో రిటైర్ కావాలన్నదే తన కోరిక అని డాక్టర్ సుధాకర్ తెలిపారు.