Begin typing your search above and press return to search.

విచారణకి సిద్ధమన్న డాక్టర్ రమేష్ ..కానీ , డైరెక్ట్ గా కాదట !

By:  Tupaki Desk   |   24 Sep 2020 3:30 PM GMT
విచారణకి సిద్ధమన్న డాక్టర్ రమేష్ ..కానీ , డైరెక్ట్ గా కాదట !
X
విజయవాడలోనే ప్యాలేస్ హోటల్ లో నడుస్తున్న కోవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగి 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. కరోనా సెంటర్లో నిబంధనల్ని పూర్తిగా ఉల్లంఘించినట్టు పోలీసులు గుర్తించారు. డాక్టర్ రమేష్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా నిర్ధారించి , అయన పై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న డాక్టర్ రమేష్, హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అనంతరం హైకోర్టు స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్టేను రద్దు చేసిన సుప్రీంకోర్టు విచారణ కొనసాగేలా సుప్రీం ఉత్తర్వులు ఇచ్చింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ తిరిగి ప్రారంభించిన ఏపీ పోలీసులు డాక్టర్ రమేష్ ను విచారణకు హాజరుకావల్సిందిగా సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. దీనితో స్పందించిన డాక్టర్ రమేష్ డైరెక్ట్ గా వచ్చి విచారణకి హాజరుకాలేనని , వీడియో విచారణకు హాజరవుతానంటూ పోలీసులకు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా తాను వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాలేనని, తనకు వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. పోలీస్ స్టేషన్ అంటే పబ్లిక్ ప్లేస్ కాబట్టి వచ్చేపోయే వారిలో ఎవరి ద్వారా అయినా తనకు కరోనా సోకే ప్రమాదం ఉంది. సో నేను పోలిసుల ముందు నేరుగా విచారణకి హాజరుకాలేనని, అయితే , పోలీసులు అనుమతి ఇస్తే .. వీడియా కాన్ఫరెన్సు ద్వారా విచారణకి సిద్ధమని , తనకేమి అభ్యంతరం ఏమీ లేదంటూ చెప్పారు. ఈ కేసు విచారణ లో పోలీసులకి పూర్తిగా సహకరించాలని కోర్టు చెప్పిన తరువాత కూడా లేనిపోని సాకులు చెప్తున్న ఈ డాక్టర్ కేసు ఎప్పటికి తేలుతుందో చూడాలి.