Begin typing your search above and press return to search.
హైదరాబాద్ కు మళ్లీ డబుల్ డెక్కర్ కళ.. బస్సులు తిరిగే మార్గాలివే!
By: Tupaki Desk | 4 Dec 2020 9:17 AM ISTహైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ ప్రారంభం కానున్నట్టు కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏయే ప్రాంతాల్లో బస్సులు అనే విషయంపై రవాణాశాఖ అధికారులు సర్వే చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు పెద్ద సంఖ్యలో తిరిగేవి. అయితే ఆ తర్వాతి కాలంలో అవి ఆగిపోయాయి. జనానికి కూడా ఆ బస్సులు అంటే క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఎందుకో కారణాలు తెలియదు కానీ అవి నిలిచి పోయాయి.
అయితే ఇటీవల ఓ నెటిజన్ హైదరాబాద్‌లో డబుల్‌డెక్కర్ బస్సులు తిరగి ప్రారంభించొచ్చు కదా.. అంటూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. రవాణాశాఖ అధికారులను సంప్రదించారు. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు తిప్పవచ్చా.. సాధ్యమేనా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని అధికారులను కోరారు. దీంతో డబుల్ డెక్కర్ బస్సులను పునరుద్ధరించాలని వారు నిర్ణయించారు. ఇందుకోసం సర్వే నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ చొరవతో రవాణాశాఖ అధికారులు హైదరాబాద్ లో పర్యటించారు. 5 మార్గాల్లో ఈ బస్సులను నడపొచ్చని ప్రాథమికంగా గుర్తించారు.
ఈ మార్గాల్లో తొలుత 10 డబుల్ డెక్కర్ బస్సులు నడపనున్నారు. మెట్రోరైళ్లు, ఫ్లై ఓవర్లు లేనిచోట ఈ బస్సులను నడుపనున్నారు. గతంలో మెహిదీపట్నం - సికింద్రాబాద్, మెహిదీపట్నం-చార్మినార్, సికింద్రాబాద్ - చార్మినార్, సికింద్రాబాద్-జూపార్కు మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడిపేవారు. అయితే ప్రస్తుతం సికింద్రాబాద్, కోఠి నుంచి ప్రస్తుతం పటాన్ చెరుకు సాధారణ బస్సులు మంచి ఆక్యుపెన్సీతో తిరుగుతున్నాయి. ఆ మార్గానికి మంచి డిమాండ్ ఉండటంతో ఆ మార్గాల్లోనే వీటిని తిప్పితే బాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు మేడ్చల్ రూట్‌లో ఉండే సుచిత్ర, కొంపల్లి వరకు, దుర్గం చెరువు వద్దకు కూడా ఓ సర్వీసు ఉండేలా చూడాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది.