Begin typing your search above and press return to search.

‘క్రిస్మస్​ వేడుకలు ఈ సారి వద్దు’ బ్రిటన్ ​లో ఆంక్షలు

By:  Tupaki Desk   |   20 Dec 2020 3:20 PM IST
‘క్రిస్మస్​ వేడుకలు ఈ సారి వద్దు’ బ్రిటన్ ​లో ఆంక్షలు
X
క్రిస్మస్​ క్రైస్తవులకు అతిపెద్ద పండగ. ఈ పండగను వాళ్లు బంధుమిత్రులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. క్రైస్తవులు జనాభా అధికంగా ఉండే బ్రిటన్​లో క్రిస్​మస్​ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అయితే ఈ ఏడాది క్రిస్మస్​ను ఎవరి ఇంట్లో వాళ్లు జరుపుకోవాలని.. భారీ వేడుకలు - సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని బ్రిటన్​ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు బ్రిటన్ ​లో అత్యవసర లాక్ ​డౌన్​ విధించారు. ప్రజలు తమ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది.

ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. బ్రిటన్ ​లో ఇంకా కరోనా కేసులు అదుపులోకి రాలేదు. ఇప్పటికే అక్కడ ఫైజర్​ టీకాకు అనుమతి ఇచ్చారు. కానీ కరోనా మాత్రం సెకండ్ వేవ్​ రూపంలో దూసుకొస్తున్నది. ఒకసారి కరోనా వచ్చి తగ్గినవాళ్లకు కూడా మళ్లీ కరోనా సోకుతున్నది. దీంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయాలని భావించింది.క్రిస్​మస్​ సందర్భంగా సామూహిక ప్రార్థనలు, వేడుకలు నిర్వహిస్తే వైరస్​ మరింత విజృంభించే అవకాశం ఉన్నదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

‘ఈ ఏడాది క్రిస్​ మస్​ వేడుకలు కుటుంబసభ్యులతో జరుపుకోండి’ అంటూ బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలకు సూచించారు. ఆదివారం (డిసెంబర్ 20) నుంచి అక్కడ కఠిన లాక్ ​డౌన్​ అమల్లోకి తీసుకొచ్చారు.

దీంతో 16 మిలియన్లకు పైగా బ్రిటన్లు ఇళ్లకే పరిమితం కాబోతున్నారు. క్రిస్మస్​ రోజు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చిరించారు. గత వారం లండన్‌ లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి.

ప్రజలు ఇంట్లోనే ఉండాలి. కేవలం ఆరోగ్యసిబ్బంది - పోలీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అత్యవసర దుకాణాలు తప్ప మిగతా షాపులు క్లోజ్​ చేయనున్నారు. క్లబ్బులు. పబ్బులు లాంటివి మూసేయనున్నారు.