Begin typing your search above and press return to search.
‘హహ్హా’ ఎమోజీ వాడొద్దు.. ఫత్వా జారీ చేసిన ఆ మత బోధకుడు , ఎందుకంటే !
By: Tupaki Desk | 26 Jun 2021 1:00 PM ISTసోషల్ మీడియా...ప్రస్తుతం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి క్షణం కూడా సోషల్ మీడియా లోనే జీవిస్తుంటారు. ఇక సోషల్ మీడియా వాడే వారికి ఎమోజీ ల గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనే లేదు. సోషల్ మీడియాలో ఎమోజీలదే కీలక పాత్ర. పోషిస్తుంటాయి. తాము ఏమి అనుకుంటున్నామో మెసేజ్ చేయకుండా మాటలని ఎమోజీలో తెలియచేస్తుంటారు. అయితే..ఓ మత బోధకుడు ఎమోజీలో ఉన్న ఒకదానిని వాడొద్దని ఏకంగా ఫత్వా జారీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయన మరెవరో కాదు .. బంగ్లాదేశ్ కు చెందిన ఇస్లాం మత బోధకుడు అహ్మదుల్లా.
అహ్మదుల్లా ఫత్వా కి ..ఫేస్ బుక్, యూట్యూబ్ లో ఆయనకు 30 లక్షల కంటే ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్నారు. ఈమేరకు ఆయన శనివారం ఆయన మూడు నిమిషాల వీడియోను పోస్ట్ చేశారు. ఎవరినైనా ఎగతాళి చేయడానికి, వెక్కిరించడానికి ఫేస్ బుక్ లో ‘హహ్హా’ ఎమోజీని వాడుతున్నారు. ఇది ఫన్ కోసం అయితే పర్వాలేదు. కానీ ఎగతాళి చేయడమే మీ ఉద్దేశం అయితే ఇలాంటిది ఇస్లాంలో నిషిద్ధం అంటూ ఆయన అన్నారు. ముస్లిం మెజారిటీ ఉన్న బంగ్లాదేశ్‌లో మతపరమైన అంశాలపై చర్చించేందుకు ఆయన క్రమం తప్పకుండా టెలివిజన్ షోలలో కనిపిస్తుంటారు. ఈ క్రమంలో ఫేస్ బుక్ లో ప్రజలను ఎగతాళి చేయడం గురించి చర్చించారు. ఇలా చేయడం నిషేధం అంటూ ఫత్వాను సైతం జారీ చేశారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుతున్నానంటూ తెలిపారు. అయితే వీడియోను దాదాపు ఒక మిలియన్ల మంది వీక్షించి, వేలాది మంది కామెంట్లు చేశారు. దీనిపై కొంతమంది సానుకూలంగా స్పందించారు. మరికొంతమంది వ్యతిరేకించారు.