Begin typing your search above and press return to search.

మీడియా రేప్ కేసు బాధితుల పేర్లు వెల్లడించొద్దు: సుప్రీం

By:  Tupaki Desk   |   4 Oct 2020 4:40 PM IST
మీడియా రేప్ కేసు బాధితుల పేర్లు వెల్లడించొద్దు: సుప్రీం
X
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ హత్యాచార బాధితురాలి పేరును కొన్ని మీడియా సంస్థలు, కొందరు సోషల్ మీడియాలో వెల్లడించడంపై దుమారం చెలరేగింది. ఈ వివాదంపై కాంగ్రెస్, దళిత సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో పేరు బహిర్గతం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి.

మహిళలపై అత్యాచారానికి సంబంధించి వార్తలు బయటకు వెల్లడించడం భారత శిక్షాస్మృతి ప్రకారం తీవ్రనేరం. ఈ నేరానికి పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ జర్నలిస్టులందరికీ ఇది విధిగా నేర్పిస్తారు. అందుకే పత్రికల్లో, మీడియాల్లో హత్యాచార బాధితురాళ్ల పేర్లను వెల్లడించరు. ఇప్పటికే ఈ విషయంలో సుప్రీం కోర్టు కఠిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

బాధితుల అనుమతి లేకుండా వారి పేర్లను బహిర్గతం చేయరాదన్నది సుప్రీం కోర్టు మార్గదర్శకాల్లో ఉన్నది. బాధితులు మరణించిన పక్షంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంఘం నుంచి అనుమతితోపాటు బాధితుల కుటుంబం అనుమతితో అత్యాచార బాధితురాలి పేరును వెల్లడించవచ్చు.

అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ లో హత్యాచారానికి గురైన బాధితురాలి అసలు పేరును వార్తపత్రికలు, ఆడియో, విజువల్, మీడియాలు వెల్లడించాయి. దీంతో దీనిపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం మీడియాకు తాజాగా ఈ మార్గదర్శకాలను పాటించాలని హితవు పలికింది. బాధితురాలి పేర్లను వెల్లడిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.