Begin typing your search above and press return to search.
అమరావతి నుండి హైకోర్టు ను తరలించ వద్దు ... న్యాయవాదులు డిమాండ్ !
By: Tupaki Desk | 23 Dec 2019 6:19 AM GMTఏపీ లో కొన్ని రోజులుగా మూడు రాజధానుల విషయం పై తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి. సీఎం అసెంబ్లీ లో చెప్పినట్లు గానే జీఎన్ రావు కమిటీ కూడా మూడు రాజధానులకే మొగ్గు చూపడంతో అమరావతిలో స్థానికుల తో పాటుగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలోనే తాజాగా వారితో న్యాయవాదులు కూడా జత కట్టారు. ప్రస్తుతం అమరావతి లో ఉన్న హైకోర్టు ను కర్నూలు కు తరలించి..అక్కడ జ్యుడీషియరీ రాజధాని చేయాలనే ప్రభుత్వ నిర్ణయం పైనా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు ను అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదన ను వ్యతిరేకిస్తూ ఏకంగా ఆరు జిల్లాల న్యాయవాదులు నిర్ణయించారు. నేటి నుండి ఈనెల 27వ తేదీ వరకు కోర్టు విధులను బహష్కరించి నిరసన తెలపాలని అడ్వొకేట్స్ జేఏసీ తీర్మానించింది. ప్రతిరోజూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, ఈనెల 24న చలో హైకోర్టు నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ప్రజల డిమాండ్ మేరకు కర్నూలు లో హైకోర్టు ఏర్పాటుకు సంకేతాలిచ్చారు. అక్కడే హైకోర్టు ఏర్పాటు చేసి..విశాఖ.. అమరావతి లో హైకోర్టు బెంచ్ ల ఏర్పాటు దిశగా జీఎన్ రావు కమిటీ సైతం సిఫార్సులు చేసింది.
వైసీపీ ప్రభుత్వం ఇంకా దీని మీద అధికారికంగా నిర్ణయం మాత్రం ప్రకటించలేదు. దీని పైన విజయవాడలో ఆరు జిల్లాల బార్ అసోసియేషన్లు సమావేశమయ్యాయి. హైకోర్టు తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. ఈ తీర్మానంలో కృష్ణాజిల్లాతో పాటుగా గుంటూరు.. పశ్చిమ గోదావరి.. తూర్పు గోదావరి..ప్రకాశం.. నెల్లూరు జిల్లాల కు చెందిన బార్ అసోసియేషన్ ప్రముఖుల పాల్గొన్నారు. వారంతా ఈ నిర్ణయానికి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. ఇక, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యమం తీవ్రతరం చేయాలని తీర్మానం లో స్పష్టం చేసారు.ఇప్పటి కే రైతుల ఆందోళనలు చేస్తున్నారు ..ఇదే సమయం లో న్యాయవాదులు కూడా పోరు బాట పట్టడంతో .. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కుంటుందో చూడాలి..