Begin typing your search above and press return to search.

'బ్రకోలీ' తో లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు!

By:  Tupaki Desk   |   24 Feb 2021 5:00 PM IST
బ్రకోలీ తో లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు!
X
ఇటీవల భారతీయులు బ్రకోలీని తమ ఆహారపదార్థాల్లో భాగం చేసుకుంటున్నారు. బ్రకోలీలో అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. బ్రకోలీ రుచితోపాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. చూడడానికి అచ్చం కాలీఫ్లవర్​లా కనిపించే బ్రకోలీతో ఎన్నో ఆరోగ్యప్రజనాలు ఉన్నాయట. జలుబు, దగ్గు, ఫ్లూ వచ్చినప్పుడు కూడా బ్రకోలీ తీసుకుంటే తక్షణమే శక్తి వస్తుంది.

బ్రకోలీలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. విటమిన్ కే అధికంగా ఉంటుంది. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇందులోని 'క్వెర్సెటిన్' తో రోగనిరోధకశక్తి వస్తుంది. జీర్ణసంబంధిత వ్యాధులు ఉన్నవాళ్లు కూడా బ్రకోలీని తరచూ తీసుకోవాలి.

వాతావరణం మారినప్పుడు చాలామందికి జలుబు చేస్తుంది. ఈ జలుబు రైనో వైరస్​ ద్వారా సంక్రమిస్తుంది. చిన్నపిల్లలకు ఈ జలుబు తొందరగానే తగ్గిపోతుంది. కానీ కొంతమందికి చాలా వారాలపాటు జలుబు అలాగే ఉండిపోతుంది. బ్రకోలీని తరచూ తీసుకుంటే రెనో వైరస్​ తో వచ్చే జలుబు చాలావరకు తగ్గిపోతుంది.

ఆకు కూరల్లో యాంటీ యాక్సిడెంట్లు, ఫ్లావనాయిడ్లు ఉంటాయి. అయితే బ్రకోలీలో వీటితోపాటు క్వెర్సెటిన్ అనే ఫ్లావనాయిడ్‌ ఉంటుంది. ఇది వైరస్‌లపై పోరాడుతుంది. జలుబు, ఫ్లూ కి కారణమైన రైనో వైరస్‌ పైనా ఈ క్వెర్సెటిన్‌కి పోరాడే శక్తి ఉంది.బ్రకోలీలో విటమిన్​ 'సి', 'కె', 'ఇ' ఉంటాయి వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాక అంటువ్యాధులు కూడా దరిచేరవు. బ్రకోలీతో ఫ్లూ జ్వరం కూడా రాదని డాక్టర్లు అంటున్నారు. కచ్చితంగా ఆహారంలో బ్రకోలీ ఉండేలా చూసుకోవాలి.