Begin typing your search above and press return to search.

ఇప్పుడైనా శృంగారానికి బ్రేక్​ ఇవ్వండి.. మీకు అర్థమవుతుందా!

By:  Tupaki Desk   |   4 Sept 2020 10:45 AM IST
ఇప్పుడైనా శృంగారానికి బ్రేక్​ ఇవ్వండి.. మీకు అర్థమవుతుందా!
X
కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్కు పెట్టుకోండి, భౌతికదూరం పాటించండి, తరుచూ చేతులు కడుక్కోండి లాంటి మాటలు విని విసిగిపోయారా? అయితే మీ అందరికోసం శాస్త్రవేత్తలు మరో కొత్త జాగ్రత్త కూడా తీసుకొచ్చారు. అదేంటంటే కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శృంగారానికి వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు సైంటిస్టులు. కొత్త వ్యక్తులతో మాత్రం అస్సలు శృంగారం లో పాల్గొనవద్దని చెబుతున్నారు. తప్పనిసరి అయితే మాత్రం ముద్దులు, కౌగిలింతలు వీలైనంత తగ్గించి, విధిగా మాస్కలు ధరించాలని చెబుతున్నారు. కెనడాకు చెందిన చీఫ్​ మెడికల్​ ఆఫీసర్​ డాక్టర్​ థెరిసా టాం కరోనాపై తాజాగా ఈ కొత్త జాగ్రత్తను సూచించారు.

శృంగార సమయంలో ముద్దులకు వీలైనంత దూరంగా ఉండాలని, ముఖాల్ని కూడా వీలైనంత దూరంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు ఆమె. ఇదంతా అయ్యే పని కాదంటారా? అయితే శృంగారానికి కొంతకాలం బ్రేక్​ ఇవ్వండి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడ ఎంత ముఖ్యమో.. శృంగారంలో పాల్గొనకపోవడం కూడా అంతే ముఖ్యమని ఆమె సూచిస్తున్నారు.

ఇటీవల కెనడా దేశంలో చాలామందికి శృంగారంలో పాల్గొనడం వల్లే కరోనా సోకిందట. విదేశాల్లోనే ఇలా ఉంటే మన దేశంలో ముంబై వంటి చాలా ప్రాంతాల్లో విచ్చలవిడి శృంగారం జరుగుతోంది. నాగాలాండ్, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో కొన్ని తెగల్లో ఇంట్లో ఎంత మంది కొడుకులు ఉంటే అంతమందికి కలిపి ఒక అమ్మాయితోనే వివాహం జరిపే సాంప్రదాయం ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో శృంగారం వల్ల కరోనా మరింత వ్యాపించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా జాగ్రత్తలు పాటించకపోతే కరోనా ఉధృతిని ఆపలేని స్థితికి చేయాల్సి వస్తుంది.