Begin typing your search above and press return to search.

అస‌ద్ అడగగానే కేసీఆర్ ఓకే చెప్పేశారు

By:  Tupaki Desk   |   3 Oct 2016 2:32 PM GMT
అస‌ద్ అడగగానే కేసీఆర్ ఓకే చెప్పేశారు
X
తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాల‌న‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆకాంక్షించిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు ఇన్నాళ్లు ప్ర‌తిప‌క్షాల నుంచి వివిధ ర‌కాల అభ్యంత‌రాలు ఎదురైన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్‌ లో తాజాగా మిత్ర‌ప‌క్ష‌మైన ఎంఐఎం నుంచి ఊహించ‌ని ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. రంగారెడ్డి జిల్లాను మూడుగా విభ‌జిస్తూ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇందులో ఒక కొత్త జిల్లా అయిన వికారాబాద్ పేరు మార్చొద్ద‌ని ఎంఐఎం అధినేత - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. చిత్రంగా దీనికి వెంట‌నే కేసీఆర్ ఓకే చెప్పారు.

ప్రతిపాదిత వికారాబాద్ జిల్లాకు అనంతగిరి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ స్వ‌యంగా ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ప్ర‌తిపాదిత వికారాబాద్ జిల్లా పేరు మార్చవద్దని సీఎం కేసీఆర్‌ కు అస‌దుద్దీన్‌ విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ పేరుతోనే జిల్లా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ - న‌ల్ల‌గొండ జిల్లాల నేత‌లతో స‌మావేశం అయిన సీఎం కేసీఆర్ ఈ మేర‌కు పేరు మార్పు చేయ‌వ‌ద్దంటూ ఆదేశించారు. త‌ద్వారా ఓవైసీ కోరిన వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్ల‌యింది. ఎంఐఎం అంటే కేసీఆర్ ఎంత ప్రాధాన్యం ఇస్తారో మ‌రోమారు రుజువైంద‌ని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/