Begin typing your search above and press return to search.

వారిపై వివక్ష వద్దు.. ఎన్నారైలకు అండగా కేరళ సీఎం

By:  Tupaki Desk   |   1 April 2020 9:50 AM GMT
వారిపై వివక్ష వద్దు.. ఎన్నారైలకు అండగా కేరళ సీఎం
X
భారతదేశానికి కరోనా వ్యాప్తి కేవలం విదేశాల నుంచి ప్రయాణం చేసిన వారి ద్వారానే వ్యాపించింది. విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా వైరస్‌ సోకింది. దేశంలో కరోనా సోకిన వారిలో మొత్తం విదేశీ ప్రయాణికులే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే వారి ద్వారా దేశంలో ఇతరులకు సోకింది. ఆ విధంగా విదేశీ ప్రయాణికుల ద్వారా దేశంలోకి పాకి కరోనా ఈ దేశంలో ఉన్న వారికి అంటుకుంటోంది. ఈ క్రమంలో భారతదేశంలో విదేశీ ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. విదేశీ ప్రయాణం చేసిన వారిపై మండిపడుతున్నారు. ఈ సందర్భంగా విదేశాల నుంచి వచ్చిన వారిని సమాజానికి దూరంగా పెడుతూ.. వివక్ష పాటిస్తుండడంతో వారు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు.

దేశంలో ఇప్పటికే 1,400కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 35మందికి పైగా మృతిచెందారు. అయితే ఈ పరిస్థితికి విదేశాల నుంచి వచ్చిన వారే (ఎన్నారై)లు కారణమని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిపై వివక్ష చూపిస్తూ దాడులు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టాయి. వారిని కాపాడుకునేందుకు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినయి విజయన్‌ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో విదేశాల నుంచి వచ్చిన వారికి (ఎన్నారై)లకు ముడిపెట్టొద్దని సూచించారు. వారి వల్లే కరోనా వైరస్‌ వచ్చిందని ప్రచారం జరగడం వాస్తవం కాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాపించింది.. అది మహమ్మారి అని వివరించారు. ఈ విషయంలో ఎవరినీ నిందించాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఎన్నారైలు రాష్ట్ర - దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్నారు. అలాంటి వారిని ఎవరూ కూడా కించపరచవద్దని - వివక్ష చూపవద్దని సూచించారు. వారు విదేశాల్లో ఎంతో కష్టపడి మన దేశానికి పంపిస్తున్న ఆదాయం వల్లే మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని వివరించారు.

ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇలా ప్రకటించడం వెనుక ఓ కథ దాగి ఉంది. దేశంలో అత్యధికంగా విదేశాలకు వెళ్లే వారిలో కేరళకు చెందిన వారు ఉన్నారు. కేరళ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రపంచంలోని అన్ని దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశాల నుంచి ఆదాయం వస్తోంది. ఈ క్రమంలోనే వారిని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి విదేశాల నుంచి వచ్చిన వారిని (ఎన్నారై) వెనకేసుకొచ్చారు. వారికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. అయితే కేరళలో మాత్రం కరోనా వైరస్‌ తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 241 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి.