Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు విరాళం.. సోనియా- రాహుల్ ఎంతిచ్చారో తెలుసా?

By:  Tupaki Desk   |   5 Feb 2021 7:00 PM IST
కాంగ్రెస్ కు విరాళం.. సోనియా- రాహుల్ ఎంతిచ్చారో తెలుసా?
X
100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైన సోనియాగాంధీ కేవలం 50వేలు ఇవ్వడమా? మొన్నటివరకు అధ్యక్షుడిగా ఉండి దిగిపోయిన రాహుల్ గాంధీ 54 వేలు ఇవ్వడమా? ఏంటిది? అయినా పార్టీనే వారిది.. ఇక విరాళాలు ఇవ్వాల్సిన కర్మ వారికెందుకు అనుకున్నారేమో.. చాలా తక్కువ విరాళాలు ఇచ్చిన కాంగ్రెస్ నేతలుగా నిలిచారు.

కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఫండ్ కింద అందిన విరాళాలు చూస్తే అందరిలోనూ ఆశ్చర్యం వేయకమానదు. 2019-20 సంవత్సరానికి గాను కాంగ్రెస్ కు వచ్చిన విరాళాల వివరాలను ఇటీవల భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తన వెబ్ సైట్ లో పొందుపరచడంతో ఈ లెక్కలు బయటకు వచ్చాయి. ఇక కాంగ్రెస్ లో ఇటీవల అసమ్మతి రాజేసిన కపిల్ సిబల్ ఏకంగా భారీ విరాళాన్ని పార్టీకి ఇవ్వడం విశేషంగా మారింది.

నిబంధనల ప్రకారం రాజకీయపార్టీలు రూ.20వేల కంటే ఎక్కువ మొత్తంలో విరాళాలు అందించిన వారి వివరాలను ఈసీకి వెల్లడించాల్సి ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో ఇటీవల నాయకత్వ సంక్షోభంపై గళమెత్తిన 23మంది నేతలే ఎక్కువ మొత్తంలో విరాళాలు అందించడం విశేషంగా మారింది.

ఇందులో సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించిన కపిల్ సిబాల్ నుంచే అత్యధికంగా మూడు కోట్ల రూపాయలు విరాళాలు అందడం విశేసం. రాహుల్, సోనియా ఇచ్చిన దాంతో పోలిస్తే ఇది చాలా పెద్ద మొత్తం కావడం గమనార్హం.కాంగ్రెస్ అందించిన నివేదిక ప్రకారం.. 2019-20 సంవత్సరానికి ఆ పార్టీ మొత్తంగా రూ.139 కోట్లు విరాళంగా అందుకుంది. అంతకుముందు ఏడాది 146 కోట్లు వచ్చాయి.