Begin typing your search above and press return to search.

'తానా' స‌తీష్ వేమ‌న విరాళం 10 కోట్లు.. అంత సీన్ ఉందా?

By:  Tupaki Desk   |   11 Dec 2021 4:30 PM GMT
తానా స‌తీష్ వేమ‌న విరాళం 10 కోట్లు.. అంత సీన్ ఉందా?
X
విరాళం అంటే ఏంటి? బాధితుల‌ను ఆదుకునేందుకు కొంత మొత్తంలో చేసే సాయం. లేదా. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు చేసే సాయం. అంతే త‌ప్ప‌.. ఎవ‌రి స‌మ‌స్య‌ను ఎవ‌రూ పూర్తిగా స‌రిదిద్ద‌లేరు. ఈ విష‌యాల‌ను ప్ర‌భుత్వాలే చెబుతున్నాయి. బాధితుల‌కు అంతో ఇంతో సాయం చేస్తున్నారే త‌ప్ప‌.. పూర్తిగా సాయం చేసే వారు లేరు. నిజానికి విరాళాలు ఇచ్చేవారు కూడా అంతో ఇంతో ఇస్తుంటారు. పోనీ.. ఎంత ఇచ్చినప్ప‌టికీ బాధితుల‌కు స్వాంత‌న చేకూర‌డం క‌ష్ట‌మనే అంటారు.కానీ, ఇప్పుడు ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం(తానా) మాజీ అధ్య‌క్షులు స‌తీష్ వేమ‌న భారీ ఎత్తున విరాళం ప్ర‌క‌టించారు.

అమ‌రావ‌తి రైతుల కోసం.. స‌తీష్ వేమ‌న ఏకంగా రూ.10 కోట్ల విరాళం ఇస్తున్న‌ట్టు ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి ఇంత పెద్ద మొత్తం ఇవ్వ‌డం అంటే మాట‌లు కాదు. సాధార‌ణంగా విరాళాలు ఇచ్చేవారు.. ప‌ది మంది నుంచి పోగేసి ఇస్తుంటారు. ఇటీవ‌ల కోమ‌టి జ‌య‌రాం నేతృత్వంలోనూ.. కొంద‌రు విరాళం ఇచ్చారు. అయితే.. అది ల‌క్ష‌ల్లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. 50 ల‌క్ష‌ల పైచిలుకు సొమ్మును విరాళంగా ఇచ్చారు. రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌కు ఇది కొంత ఇతోధికంగా తోడ్ప‌డుతుంద‌ని వారు భావించారు. అయితే.. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో విరాళం ప్ర‌క‌టించ‌డమే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఎవ‌రూ కూడా ఇంత పెద్ద మొత్తం ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఇంత పెద్ద మొత్తం ప్ర‌క‌టించ‌డ‌మే కాదు.. రేపు ఇవ్వాలి కూడా. ఈ నేప‌థ్యంలో ఇంత పెద్ద మొత్తం ఎమౌంటు అంతా కూడా ఆయ‌న సొమ్మేనా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. ఎంత రాష్ట్రంపై అభిమానం ఉన్నా.. రాజ‌ధాని పోరులో భాగంగా ఉండాల‌ని అనుకున్నా.. ఇంత పెద్ద మొత్తం విరాళం ఇవ్వాలంటే.. ఒకింత ఆలోచించాల్సిందే. అయిన‌ప్ప‌టికీ.. స‌తీష్ వేమ‌న‌.. ఇస్తున్నారంటే.. దీని వెనుక వేరే వారి నిధులు, విరాళాలు కూడా ఉన్నాయా? అనే సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. త‌ను సొంతగానే సంపాయించి ఉంటే.. ఇంత పెద్ద మొత్తం ఇస్తారా? అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. స‌తీష్ వేమ‌న సొంత సొమ్మే అయితే.. విరాళాల పోటీలో ఇదొక నూత‌న అధ్యాయం సృష్టిస్తుంద‌ని అంటున్నారు.