Begin typing your search above and press return to search.

అదే నిజమైతే చైనాను వదిలిపెట్టం: ట్రంప్

By:  Tupaki Desk   |   19 April 2020 5:00 PM IST
అదే నిజమైతే చైనాను వదిలిపెట్టం: ట్రంప్
X
అమెరికాలో కరోనా మరణమృదంగం వినిపిస్తుంటే దాన్ని అరికట్టలేని అధ్యక్షుడు ట్రంప్ తాజాగా చైనా దేశంపై ఆడిపోసుకున్నారు. అమెరికాలో కంటే చైనాలోనే కరోనా మరణాలు ఎక్కువని.. చైనా దాస్తోందని.. తొందరలోనే దాన్ని బయటపెడుతామని హెచ్చరికలు జారీ చేస్తూ తాజాగా ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు.

తాజాగా చైనా కరోనా మరణాల సంఖ్యను సవరించింది. మృతుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించింది. దీన్ని బేస్ చేసుకొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై నిప్పులు చెరిగారు.

ట్రంప్ ట్వీట్ చేస్తూ.. ‘చైనాలో తాజాగా లెక్కలు చూస్తే కరోనా మరణాలు డబుల్ అయ్యాయి.. అమెరికా కంటే కేసులు చాలా ఎక్కువ. అమెరికా.. చైనాకు దగ్గర్లో కూడా లేదు.. అత్యాధునిక వైద్య సదుపాయాలున్న ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ ల కంటే చైనాలో మరణాలు తక్కువ అంటే నమ్మబుద్ది కావడం లేదు’ అంటూ చైనా వైఖరిని ఎండగట్టారు.

ఇక కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనాయే కారణమని తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ తాజాగా చైనాను హెచ్చరించారు. ఇంతటి ప్రాణనష్టానికి కారణమైన చైనాను అంత తేలికగా తీసుకునేది లేదని స్పష్టం చేశారు.

అయితే అమెరికాలో కరోనా కేసులు, మరణాలు ఎక్కువ అవుతుంటే ఈ నెపాన్ని ట్రంప్ చైనాపై నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశంలో కరోనాను కంట్రోల్ చేయలేక.. లాక్ డౌన్ ఎత్తివేస్తూ తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు చైనాపై నిందలేస్తున్నారని విపక్షాలు, అమెరికన్లు మండిపడుతున్నారు.