Begin typing your search above and press return to search.

ట్రంప్ ఎంత బలుపు మాట అనేశాడు..

By:  Tupaki Desk   |   13 July 2016 11:09 AM IST
ట్రంప్ ఎంత బలుపు మాట అనేశాడు..
X
సాటి వారి పట్ల ఏ మాత్రం మర్యాద లేకుండా వ్యవహరించటం అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ కు అలవాటే. తాజాగా ఆయన ధోరణి మరింత ముదిరిపోయినట్లుగా కనిపిస్తోంది. తనతో పాటు.. విధులు నిర్వర్తించేందుకు.. ఉపాధ్యక్షుడి మీద దారుణ వ్యాఖ్య చేశారు. అహంభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ట్రంప్ నోరు ఎంత గబ్బుదో తెలిసిందే. అయితే.. స్వపక్షం వారి మీద కూడా ఆయన ఎంతగా మాట తూలుతారన్న విషయం తాజాగా ఆయన చేసిన వ్యాఖ్య స్పష్టం చేసింది.

తాను అధ్యక్షుడినైతే.. తనతో విధులు నిర్వర్తించే ఉపాధ్యక్ష పదవి కోసం పోటీ పడే వారు.. దాడి చేసే కుక్కలాంటోడు అయి ఉండాలని.. అలాంటి తోడు తనకు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. ఒక రకంగా చెప్పాలంటే.. తన కింద కుక్కలా ఉండాలన్నట్లుగా ట్రంప్ మాటలు ఉండటం గమనార్హం. ఉపాధ్యక్ష పదవిని చేపట్టే నేత ఎలా ఉండాలన్న విషయాన్ని చెబుతూ.. తాను అందరిని సర్ ప్రైజ్ చేయటానికో.. జోక్ గానో చెప్పటం లేదని.. ఉపాధ్యక్ష పదవిని చేపట్టే వారు ఎంత సమర్థంగా పని చేయాలన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటమే తన ఉద్దేశంగా చెప్పుకొచ్చారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఉపాధ్యక్షుడి గురించిన చర్చ వచ్చిన సందర్భంగా స్పందించిన ట్రంప్.. అన్ని పరిస్థితులకు తగ్గట్లు పని చేసే వ్యక్తి తనకు తోడుగా ఉండాలని.. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక దాడి చేసే కుక్కలా పని చేయాలని.. అలాంటి వ్యక్తి అవసరం తనకు ఉందని చెప్పుకొచ్చారు. సో.. ట్రంప్ దృష్టిలో ఉపాధ్యక్షుడు అంటే.. దాడి చేసే కుక్కలాంటోడన్న మాట. తనతో పని చేయాల్సిన ఒక నేత గురించి ఇంత అవమానకరంగా మరే రాజకీయ నేతా ఇలా మాట్లాడలేరేమో..?