Begin typing your search above and press return to search.

మోడీ - ట్రంప్.. గాంధీని అవమానించినట్టేనా?

By:  Tupaki Desk   |   23 Feb 2020 5:00 AM IST
మోడీ - ట్రంప్.. గాంధీని అవమానించినట్టేనా?
X
ఏ దేశ అధ్యక్షుడు అయినా భారత్ వచ్చినా ప్రపంచంలోనే అహింసా మార్గంతో స్వాతంత్ర్యం సాధించిన మన జాతిపిత మహాత్మా గాంధీని స్మరించుకోవడం కానీ.. వీలైతే బాపూజీ ఘాట్ - గుజరాత్ వస్తే సబర్మతి ఆశ్రమానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. దేశాధ్యక్షులందరూ గాంధీ నేతలను సందర్శించడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా జాతిపిత ఘాట్ ను సందర్శించారు. తన రోల్ మోడల్ గాంధీనే అని చాటారు.

కానీ సెంటిమెంట్లకు అతీతుడైన మహా మొరటు నాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన గాంధీజీని లైట్ తీసుకున్నారు. భారత జాతిపితను అవమానించారనే చెప్పాలి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మాదాబాద్ లో ఈనెల 24న పర్యటించనున్న సంగతి తెలిసిందే. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలిసి 22 కి.మీల మేర రోడ్ షోలో పాల్గొంటారు. అయితే తాజాగా సెక్యూరిటీ కారణాల వల్ల రోడ్ షోన్ 9 కి.మీలకు తగ్గించారు.

ఇక షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్ లోని గాంధీ నడియాడిన సబర్మతీ గాంధీ ఆశ్రమాన్ని ట్రంప్ సందర్శించాల్సి ఉంది. తాజాగా సవరించిన షెడ్యూల్ గాంధీ ఆశ్రమం పర్యటనను ట్రంప్ రద్దు చేశారు. ట్రంప్ పర్యటనలో మన జాతిపిత గాంధీ ఆశ్రయం సందర్శనను తొలగించడం దుమారం రేపుతోంది. ఎంత అమెరికా అధ్యక్షుడైతే మాత్రం ఇలా గాంధీని అవమానిస్తారా అని మోడీ, ట్రంప్ ల తీరుపై కాంగ్రెస్ వాదులు మండిపడుతున్నారు. ట్రంప్ పర్యటన రద్దు మహాత్ముడిని అవమానించడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.