Begin typing your search above and press return to search.
ట్రంప్ సూచన - కరోనా నుండి బయటపడ్డ ఫ్లోరిడా వ్యక్తి
By: Tupaki Desk | 24 March 2020 9:05 AM ISTకరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని బలితీసుకుంది. లక్షలాది మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు దీనికి మందు లేదు. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. కరోనాకు విరుగుడు కనుగొనే వ్యాక్సిన్ ప్రక్రియ సత్ఫలితాలు ఇచ్చే దశకు చేరుకుందని - హైడ్రాక్సీక్లోరోక్వినైన్ - అజిత్రోమైసిన్ కలయికతో దీనిని రూపొందిస్తున్నవ్యాక్సిన్ కరోనాను నివారించే అవకాశముందన్నారు. హైడ్రాక్సీక్లోరోక్వినైన్ బాగా పని చేస్తుందని వైద్యులు కూడా చెప్పారన్నారు.
దీనికి కొనసాగింపుగా తాజాగా మరో ట్వీట్ చేశారు. ఫ్లోరిడాలో ఓ వ్యక్తి తాను సూచించిన డ్రగ్ ను ఉపయోగించి బయటపడ్డారని ట్రంప్ పేర్కొంటూ ఈ ట్వీట్ చేశారు. న్యూయార్క్ - ఇతర చోట్ల దీనిని (మెడిసిన్) ప్రారంభించడానికి ముందే శుభవార్త అంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తకు సంబంధించిన లింక్ పోస్ట్ చేశారు. ఈ వార్త ప్రకారం.. ఫ్లోరిడాలో 52 ఏళ్ల ఓ వ్యక్తి ట్రంప్ సూచించిన డ్రగ్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ మేరకు అతను చెప్పినట్లుగా కథనంలో ఉంది.
అతని పేరు రియో గియార్డినియెరి. అతను బ్యాక్ పెయిన్ - తలనొప్పి - దగ్గు వంటి వాటితో ఆసుపత్రిలో చేరాడు. అతనికి కోవిడ్-19 ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సౌత్ ఫ్లోరిడాలోని మెమోరియల్ రీజినల్ హాస్పిటల్ వైద్యులు అతనికి చికిత్స చేశారు. కొద్ది వారాల తర్వాత వారు చేతులెత్తేశారు. ఆ సమయంలో తాను మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేనని, తాను ఇక మరణించినట్లేనని భావించానని రియో గియార్డినియెరి అన్నారు.
అదే సమయంలో ట్రంప్ సూచించిన మెడిసిన్ గురించి తన స్నేహితుడు ఒకరు ఆర్టికల్ చదివి - దానిని తనకు పంపించారని చెప్పాడు. ఈ మెడిసిన్ దశాబ్దాలుగా యాంటీ మలేరియాకు వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే తాను ఈ మెడిసిన్ తీసుకొని ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు.
కాగా, వైద్య చరిత్రలో అతిపెద్ద గేమ్ ఛేంజర్స్ అవతరణకు అవకాశముందని - హైడ్రాక్సీక్లోరోక్వినైన్ - అజిత్రోమైసిన్ ఈ రెండింటి కలయికతో రూపొందే సరికొత్త ఔషధం సత్ఫలితాలను ఇస్తుందనే ఆశాభావం ఉందని, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనిపై పరిశోధన కొనసాగిస్తోందని - అజిత్రోమైసిన్ కంటే హైడ్రాక్సీక్లోరోక్వినైన్ మంచి ఫలితాలనిస్తోందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యాంటీ మైక్రోబయాల్ ఏజెంట్స్ కూడా చెప్పారన్నారు. పరిశోధకులు ఈ రెండింటినీ వెంటనే వినియోగంలోకి తీసుకొస్తారనే విశ్వాసముందన్నారు.
మలేరియా నివారణకు ఉపయోగించే క్లోరో క్విన్ కరోనా వైరస్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుందని కొంతమంది వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు. దీనికి హెల్త్ అఫీషియల్స్ అప్రూవల్ అవసరం.