Begin typing your search above and press return to search.

ట్రంప్ భార్యను సీన్లోకి తీసుకొచ్చేశారు

By:  Tupaki Desk   |   23 March 2016 4:35 AM GMT
ట్రంప్ భార్యను సీన్లోకి తీసుకొచ్చేశారు
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని తెగ ఉబలాటపడిపోతున్న డోనాల్డ్ ట్రంప్ మీద ఆయన ప్రత్యర్థులు.. ఆయన సతీమణిని ఆస్త్రంగా సంధించటం తాజాగా చోటు చేసుకున్న పరిణామంగా చెప్పొచ్చు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడే ట్రంప్ కు.. ఆయనకు అదే రీతిలో సమాధానం చెప్పాలని భావించారో ఏమో కానీ.. ఆయన సొంత పార్టీకి చెందిన నేతలే ట్రంప్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసే ప్రయత్నానికి తెర తీశారు. ఇంతకాలం ట్రంప్ ను దెబ్బ తీయటానికి బ్రహ్మండమైన అస్త్రం ఏం దొరుకుతుందా? అని వెతికిన వారికి.. ఊహించని వరం దొరికినట్లుగా ఫీలవుతున్నారు.

ఎందుకంటే.. ట్రంప్ ప్రత్యర్థులకు తిరుగులేని అస్త్రంగా మారింది మరెవరో కాదు.. ట్రంప్ సతీమణి.. సూపర్ మోడల్ గా పేరున్న మెలానియా ట్రంప్ ను వాడేయటానికి డిసైడ్ అయ్యారు. ఆమె మోడల్ గా ఉన్నప్పుడు బ్రిటీష్ పత్రిక అయిన ‘‘జీక్యూ’’కు న్యూడ్ ఫోటో సెషన్ చేసింది. ఇప్పుడా ఫోటోల్ని సంపాదించిన ట్రంప్ ప్రత్యర్థులు.. అమెరికా ఫస్ట్ లేడీగా ఈమెను ఎంచుకుంటారా? లేదంటే టేడ్ క్రూజ్ కు మద్దతు ఇస్తారా? అంటూ ట్రంప్ సతీమని న్యూడ్ ఫోటోలను ప్రచారానికి తీసుకొచ్చారు.

45 ఏళ్ల మెలానియా నాలుగు భాషలు మాట్లాడగలిగిన నేర్పరి. అంతేకాదు స్టైల్ చిహ్నంగా ఆమెను పలువురు అభివర్ణిస్తారు. ట్రంప్ కానీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. వైట్ హౌస్ కి ఫస్ట్ లేడీ అయిన అత్యంత అందమైన వారిలో ఒకరిగా నిలుస్తారట. ఈమె ఖర్చు గురించి ప్రస్తావిస్తూ.. ట్రంప్ ను వివాహమాడిన సమయంలో వెడ్డింగ్ గౌన్ కోసం ఆమె పెట్టిన ఖర్చు ఏకంగా 2లక్షల అమెరికా డాలర్లట. ఇలా మెలానియా గొప్పతనాన్ని కొందరు కీర్తిస్తుంటే.. మరోవైపు.. ఆమె న్యూడ్ ఫోటోలతో ట్రంప్ ను దెబ్బ తీయాలని చేస్తున్న ప్రయత్నం ఏ మాత్రం సరికాదన్న వాదన వినిపిస్తోంది. మరి.. అమెరికా ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.