Begin typing your search above and press return to search.
నమస్తే ట్రంప్ :డోనాల్డ్ ట్రంప్ స్పీచ్ హైలెట్స్..మోడీ పై ప్రశంసల వర్షం!
By: Tupaki Desk | 24 Feb 2020 3:53 PM ISTప్రస్తుతం భారతదేశం మొత్తం ట్రంప్ నామస్మరణతో మారుమోగిపోతుంది. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మొదటిసారి భారత్ పర్యటనకి వచ్చారు. దీనితో భారత్ ప్రభుత్వం స్వాగత ఏర్పాట్లని అంగరంగ వైభవంగా చేసింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ చేసుకున్న ట్రంప్ ని సాదరంగా ఆహ్వానించిన మోదీ , ఆ తర్వాత అక్కడి నుండి దాదాపుగా 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతెరా స్టేడియం వద్ద రోడ్ షో నిర్వహించారు. మార్గ మద్యంలో గాంధీజీ నడియాడిన సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు. ఆ తరువాత మోతెరా స్టేడియం కి చేరుకొని నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా సభకి ట్రంప్ గారిని పరిచయం చేసిన ప్రధాని మోడీ ..ఆ తరువాత ట్రంప్ ని ప్రసంగించాల్సిందిగా కోరారు.
అశేష జనవాహిని మధ్య ‘నమస్తే..’ అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అధ్భుత విజేతగా దేశాన్ని నిలిపేందుకు మోదీ కృష్టి చేస్తున్నారని ఆయన అన్నారు. భారత్‌కు రావడం గౌరవంగా భావిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. ప్రధాని మోదీ తనకు నిజమైన స్తేహితుడన్న ఆయన.. ఐదు నెలల క్రితం ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్ బాల్ మైదానంలో మోదీకి స్వాగతం పలికిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంలో తనకు స్వాగతం లభించిందని తెలిపారు. బాలీవుడ్ నుంచి ఉగ్రవాదంపై పోరాటం వరకు అనేక అంశాలను ప్రస్తావించారు. మా గుండెల్లో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందన్న ట్రంప్ - అమెరికా భారత్ ను ప్రేమిస్తోందని - తమ దేశం ఇండియాను గౌరవిస్తోందని - అమెరికా ఎప్పటికీ భారతీయులకు నమ్మకమైన మిత్రదేశమన్నారు.
70 ఏళ్లలో భారత్ అద్భుతశక్తిగా ఎదిగిందని - ప్రగతి సాధించడంలో ప్రపంచానికి ఈ దేశం దిశానిర్దేశం చేస్తోందని అన్నారు. ప్రధాని మోదీ కేవలం గుజరాత్‌కే గర్వకారణం కాదు. కష్టించి పని చేయడానికి - ఉపాసనకు మీరో సజీవ సాక్ష్యం. భారతీయులు ఏదైనా సాధించగలరు - తాము అనుకున్నది చేయగలరు. ప్రధాని మోదీ అద్భుతంగా ఎదిగారు అని ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. ప్రధాని మోదీ ఛాయ్‌వాలా ప్రస్థానాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసిన ట్రంప్.. ఆయన్ను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారన్నారు. ఒక చాయ్ వాలాను ప్రధానమంత్రిగా చేసిన గొప్పదనం భారతీయులకు మాత్రమే సాధ్యపడిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒక్క అమెరికా మాత్రమే కాదని - ప్రపంచ దేశాలు సైతం భారత్ పట్ల గౌరవభావాన్ని చూపడానికి భారతీయుల వ్యక్తిత్వమే కారణమని అన్నారు ట్రంప్. ఇక , ఇదే సమయంలో స్వామి వివేకానందుడి గురించి ప్రస్తావించారు. వివేకానందుడి వంటి అసాధారణ వ్యక్తిత్వం భారతీయుల సొంతమని అన్నారు. వివేకానందుడు ప్రపంచానికే పాఠాలను నేర్పించారని స్మరించుకున్నారు.
ప్రపంచ దేశాల ప్రజలు బాలీవుడ్ సినిమాలు, భాంగ్రా డ్యాన్స్‌తో ఆనందిస్తుంటారన్న ట్రంప్.. సచిన్ - కోహ్లి లాంటి గొప్ప క్రికెటర్లను మీరు ఉత్సాహ పరుస్తారన్నారు. షోలే, దిల్ వాలే దునియా లేజాంగే సినిమాలను కూడా ట్రంప్ ప్రస్తావించారు. సంవత్సరానికి రెండువేలకు పైగా సినిమాలను చిత్రీకరించే సామర్థ్యం భారత్ కు మాత్రమే ఉందని - ప్రపంచంలో మరే దేశానికి కూడా ఈ స్థాయిలో సినిమాలను తీసే శక్తి సామర్థ్యాలు లేవని చెప్పారు. టాప్ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ - విరాట్ కోహ్లీల గురించి కూడా ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. రాజకీయాలు - సినిమాలను మాత్రమే కాదు.. క్రీడారంగాన్ని కూడా శాసించదగ్గ ఆటగాళ్లను భారతీయులు క్రీడా ప్రపంచానికి అందించారని చెప్పారు. భారతీయులు క్రికెట్ ను తమ మతంగా మార్చుకున్నారని తెలిపారు. అలాగే , 2017 నవంబర్ లో ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ ను సందర్శించారని గుర్తు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ పారిశ్రామిక సదస్సులో తన కుమార్తె ఇవాంకా ట్రంప్ పాల్గొన్నారని మరోసారి ఆ విషయాన్ని గుర్తుచేశారు.
ఇక ఇదే సమయంలో ట్రంప్ మరో కీలకమైన అంశం గురించి చెప్పారు. రక్షణ రంగంలో భారత్ - అమెరికా మధ్య సహకారం కొనసాగుతుందన్న ట్రంప్.. ఈ భూమ్మీదున్న అత్యాధునిక - భయం గొల్పే సైనిక పరికరాలను భారత్ కు ఇవ్వడానికి తాము సంసిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా గొప్ప ఆయుధాలను రూపొందించిందన్న ట్రంప్ - భారత్ తో ఒప్పందం చేసుకుంటామన్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పు నుంచి పౌరులను కాపాడుకోవడంలో ఇరు దేశాలు ఐక్యంగా ఉన్నాయన్న ట్రంప్ - తన హయాంలో ఐసిస్ ఉగ్రభూతాన్ని నామరూపాల్లేకుండా చేశానన్నారు. భారత్ తో మంగళవారం 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ - అమెరికా కట్టుబడి ఉన్నాయన్న ట్రంప్.. ఉగ్రవాద సంస్థలను నాశనం చేయడానికే తమ ప్రభుత్వం పాక్ తో కలిసి పని చేస్తోందన్నారు. పాకిస్థాన్ తో తమ సంబంధాలు బాగున్నాయన్న ఆయన, పాక్ లో పురోగతి కనిపిస్తోందన్నారు. భారత్ రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని , ఇంతటి ఘన స్వాగతాన్ని, గొప్ప ఆతిథ్యాన్ని మేం చిరకాలం గుర్తుంచుకుంటామని తెలిపారు.