Begin typing your search above and press return to search.
ట్రంప్ తో కరోనా వ్యాధిగ్రస్తుడి షేక్ హ్యాండ్..!
By: Tupaki Desk | 8 March 2020 5:11 PM ISTఅగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో కరోనా వైరస్ సోకిన వ్యక్తులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 12కు చేరింది. అయితే, ఇలాంటి ఆందోళనకర సమయంలో అమెరికా ఎన్నికల ప్రచారంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా బాధితుడి బారిన పడ్డారు. ఫిబ్రవరి 26 నుంచి 29 వరకు జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న సమయంలో ఓ కరోనా వైరస్ బాధితుడు ఆయనకు షేక్ హ్యాండివ్వడంతో అధ్యక్షుడి ఆరోగ్యంపై కొత్త ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల ప్రకారం చివరి రోజు ఫిబ్రవరి 29న కాన్ఫెరెన్స్ జరిగే సమయంలో స్టేజీపై ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ కు కరోనా వైరస్ సోకిన ఆ వ్యక్తి షేక్ హ్యాండిచ్చాడని ఆ కాన్ఫరెన్స్ చైర్మన్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన వివరణలో స్పష్టం చేశారు. కాగా, ప్రెసిడెంట్ ట్రంప్ తో చేతులు కలిపిన సదరు వ్యక్తి వ్యక్తికి న్యూజెర్సీ ఆస్పత్రిలో పరీక్షలు చేయగా కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజా ప్రచారంపై ఆయన స్పందిస్తూ, డొనాల్డ్ ట్రంప్ కు షేక్ హ్యండిచ్చానని ప్రకటించాడు. అయితే, ఈ బాధితుడి చర్యపై మీ స్పందన ఏంటని ట్రంప్ ను ప్రశ్నించగా ‘నాకు ఏ భయమూ లేదు - కరోనా వైరస్ ప్రమాదం ఉన్నప్పటికీ నేను ఎన్నికల ర్యాలీలు కొనసాగిస్తా’’ అని తన మొండితనాన్ని చాటుకున్నారు.
ఇదిలాఉండగా, అమెరికాలోని సియాటెల్‌లో కొత్తగా 20 కేసులు నమోదు అయ్యాయి. రోడ్ ఐలాండ్ లో సుమారు 200 మందిని క్వారెంటైన్ చేశారు. మహమ్మారి కరోనాకు నియంత్రించేందుకు అమెరికా దేశ ఉభయసభలు .. మెడికల్ ఎయిడ్ కోసం ఎమర్జెన్సీ నిధులను రిలీజ్ చేసింది. అయితే, వారంలోగా పదిలక్షల టెస్టింగ్ కిట్లను అందివ్వడం వీలుకాదు అని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు.