Begin typing your search above and press return to search.
ఇమిగ్రేషన్ రద్దు పై క్లారిటీ ఇచ్చిన ట్రంప్!
By: Tupaki Desk | 22 April 2020 1:40 PM ISTఅమెరికాలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలిక నిషేధం విధించనున్నట్టు అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా పౌరుల ఉద్యోగాల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ట్రంప్ చెప్పారు. అయితే ఈ నిషేధం 60 రోజులపాటు అమల్లో ఉంటుందని ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నిషేధం శాశ్వత నివాసం కోరుకునే వారికే వర్తింస్తుందని - లాక్ డౌన్ ముగిసన తర్వాత.. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రథమ ప్రాధాన్యత ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికాలో ప్రస్తుతం కరోనా వైరస్ ఉంది కాబట్టి ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు ఊడిపోవడంతో… ఉన్న ఉద్యోగాల్ని విదేశీ వలసదారులు లాగేసుకోకుండా స్థానికులకే దక్కేందుకు ఈ 60 రోజుల వలస వాదుల నిషేధాన్ని ట్రంప్ తాజాగా ప్రకటించారు. 60 రోజుల తర్వాత ట్రంప్ ఆ నిషేధం కొనసాగిస్తారో లేక ఎత్తేస్తారో తెలియదు. అసలే అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న టైం. ఈ సమయంలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని తెలుస్తుంది.
వలసలను నియంత్రించడం వల్ల నిరుద్యోగ అమెరికన్లకు ఉద్యోగాలు లభిస్తాయి - అమెరికన్ల ఉద్యోగ భద్రతపై కూడా ట్రంప్ ప్రస్తావించినందువల్ల నాన్–ఇమిగ్రంట్ వీసా అయిన హెచ్1బీ పైనా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. అయితే కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి - ఆహార సరఫరా చేస్తున్న విదేశీయులకు ఈ నిషేధం నుంచి మినహాయింపు కల్పించవచ్చని వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు కరోనాను అదుపు చేయడంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.