Begin typing your search above and press return to search.

వర్మ శాసించాడు.. ట్రంప్ పాటించాడు..

By:  Tupaki Desk   |   1 March 2020 11:00 PM IST
వర్మ శాసించాడు.. ట్రంప్ పాటించాడు..
X
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీక్ నెస్ పై ప్రధాని మోడీ కొట్టాడా? అందుకే ఏ దేశానికి లొంగని ట్రంప్ భారత్ లోని స్వాగతానికి ఫిదా అయ్యాడా? మోడీతో, భారత్ తో స్నేహం చేశాడా? అంటే అవుననే అంటున్నాడు రాంగోపాల్ వర్మ.

ట్రంప్ భారత పర్యటన సందర్భంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ‘భారీ జన సమూహాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పిచ్చి. వాటిల్లో ప్రసంగించాలని ఆయనకు ఉబలాటం. ట్రంప్ బలహీనతను అడ్డం పెట్టుకొని భారత ప్రధాని మోడీ గేమ్ ఆడారు. కోటి మందిని మీ సభకు రప్పిస్తానని అహ్మాదాబాద్ రప్పించాడు’ అంటూ వర్మ మొన్నీ మధ్య చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

తాజాగా భారత పర్యటన ముగిసి అమెరికా వెళ్లిన ట్రంప్ అక్కడ సౌత్ కరోలినాలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సభలో మాట్లాడారు. కేవలం 10-15 వేల మంది హాజరైన ఆ సభను చూసి ఆవేదన వ్యక్తం చేశాడు. తన సభకు భారీ సంఖ్యలో జనం రావడాన్ని చాలా ఇష్టపడుతానని.. భారత్ లో లక్షా 25వేల మంది మధ్య ప్రసంగించడం గొప్ప అనుభూతి అంటూ అమెరికాలో వ్యాఖ్యానించి సంచలన సృష్టించాడు.

130కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో అంతమంది జనాలు సభకు వచ్చినప్పుడు.. అంతకన్నా తక్కువ జనాభా 35 కోట్లు కలిగిన అమెరికాలో ఇంతమంది సభకు రావడం గొప్ప విషయమేనని ట్రంప్ తన భారత పర్యటన అనుభవాలను గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇకపై నా మీటింగ్ కు జనం రారేమోననే బాధ లేనే లేదు అంటూ చెప్పుకొచ్చాడు.