Begin typing your search above and press return to search.
ఉత్తరకొరియా కిమ్ తెలివైన వాడు: ట్రంప్
By: Tupaki Desk | 11 Sept 2020 10:45 AM ISTకరుడుగట్టిన ఉత్తరకొరియా అధ్యక్షుడిని కూడా తెలివైన వాడు అంటూ ట్రంప్ పొగిడేయడం విశేషం. అధికారం కోసం సొంత కుటుంబ సభ్యులను, సొంత మామను చంపిన కిమ్ ను ట్రంప్ పొగిడేశాడు. ఎలా చంపాడన్న విషయాన్ని కూడా కిమ్ స్వయంగా ట్రంప్ కు చెప్పాడట.. ఇదంతా విని ట్రంప్ అతడి క్రూరత్వాన్ని తిడతాడు అని అంతా అనుకున్నారు. కానీ ట్రెయిన్ రివర్స్.. ట్రంప్ పొగిడేశాడు.
ఉత్తరకొరియా పాలకుడు కిమ్ తనతో ఎన్నో విషయాలు పంచుకున్నాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ట్రంప్ ఇంటర్వ్యూలు చేసిన అమెరికా జర్నలిస్టు ఓ పుస్తకంలో ఈ విషయాలు వెల్లడించారు. అందులో కిమ్ గురించిన ఆసక్తికర విషయాలున్నాయి.
కిమ్ ను మొదటిసారిగా కలిసినప్పుడే తనను ఆకట్టుకున్నారని.. అతనెంతో తెలివైన వాడని ట్రంప్ పేర్కొన్నాడు. ఉత్తరకొరియా పాలకుడిగా తాను ఎదిగిన తీరు, సొంత మామను చంపిన వైనాన్ని గ్రాఫిక్స్ ద్వారా కిమ్ విమరించినట్లు చెప్పారు.
అమెరికాతో కయ్యానికి కాలుదువ్విన కిమ్ ఆ తర్వాత మెత్తపడి సింగపూర్ లో అధ్యక్షుడు ట్రంప్ తో రాజీకొచ్చాడు. ఇప్పటికీ స్నేహంగానే ఉంటున్నాడు. ఈ మధ్య కనిపించకుండా పోయి మళ్లీ దర్శనమిచ్చాడు.కరుడుగట్టిన కిమ్ పై ట్రంప్ కు మంచి అభిప్రాయమే ఉన్నట్టుంది.