Begin typing your search above and press return to search.
ట్రంప్‌కు షాక్..ఇండియన్లకు భారీ గుడ్ న్యూస్
By: Tupaki Desk | 8 May 2020 9:00 AM ISTఆంక్షల పరంపర... షాకుల ఒరవడికి సుపరిచిత చిరునామా అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయన సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మెజార్టీ లబ్ధిదారులు భారతీయులే కావడం గమనార్హం. హెచ్ 4 వీసా హోల్డర్‌ల వర్క్ పర్మిట్లను బ్లాక్ చేయవద్దని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టును డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కోరింది. వారి వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు ఎలాంటి సమస్య లేదని తెలిపింది.
అమెరికాలో హెచ్1బీ వీసాపై పనిచేసే విదేశీ నిపుణుల జీవిత భాగస్వాములకు పని అనుమతి కోసం 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్-4 వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసా కలిగి ఉండి గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నిస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములకు ఈ వీసాలు మంజూరు చేస్తారు. ఈ హెచ్4 వీసాల ద్వారా వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు కల్పించారు. ఈ విధానం భారతీయులకు భారీ లబ్ధి చేకూర్చింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ అనుమతులను రద్దుచేశారు. అమెరికన్ల అవకాశాలను హెచ్4 వీసా గండికొడుతోందని ఆరోపించారు. దీంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇలాంటి కోర్టులోనే తాజాగా తీర్పు వెలువడింది.
హెచ్–1బీ వీసా హోల్డర్ల భార్య/భర్తకు, 21 ఏళ్ల లోపు పిల్లలకు హెచ్–4 వీసాలను యూఎస్ సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) జారీ చేస్తుంది. హెచ్–4 వీసాలు ఉన్న వాళ్లకు అక్కడ పని చేసేందుకు అనుమతి ఉంది. అయితే, దీనిపై దాఖలైన పిటిషన్ నేపథ్యంలో వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ కోర్టు లో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ రిపోర్టు అందించింది.