Begin typing your search above and press return to search.

ఓటమిని అంగీకరిస్తూనే మెలికపెట్టిన ట్రంప్​..!

By:  Tupaki Desk   |   25 Nov 2020 11:30 AM IST
ఓటమిని అంగీకరిస్తూనే మెలికపెట్టిన ట్రంప్​..!
X
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన చాలాకాలానికి డొనాల్డ్ ట్రంప్​ మంకు పట్టు విడిచిపెట్టాడు. ఆయన చాలా కాలం పాటు ఓటమిని అంగీకరించలేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ వచ్చాడు. తాను ఈ ఓటమిని అంగీకరించనని .. వైట్​హౌస్​ను విడిచిపెట్టనని భీష్మించుకుకూర్చున్నాడు. అధికార మార్పిడి ససేమిరా అన్నాడు. దీంతో ఆయన కూతురు ఇవాంక.. ఇతర కుటుంబసభ్యులు ట్రంప్​కు నచ్చజెపుతున్నారన్న వార్తలు వినిపించాయి. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఎట్టకేలకు ట్రంప్​ దిగొచ్చాడు. అధికార బదిలీకి తాను అంగీకరస్తున్నానని ప్రకటించాడు. ఈ మేరకు వైట్​హౌస్​ అధికారులకు ఆదేశాలు జారీచేశాడు.

ఎన్నికల్లో విజయం అనంతరం జో బైడెన్​ స్పందిస్తూ. .ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఆరోపణలు, విమర్శలు పక్కనపెట్టి.. అమెరికా అభివృద్ధిపై చర్చించుకుందామంటూ ట్రంప్ కు సూచించారు. అయితే డోనాల్డ్​ ట్రంప్​ మాత్రం మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ నేను అధికార మార్పిడి, బదలాయింపుకు సహకరిస్తున్నాను. కానీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి అన్న నా వాదనకు కట్టుబడి ఉన్నాను. ఈ విషయంపై విచారణ జరగాల్సిందే. నేను కోర్టులోనే దీన్ని తేల్చుకుంటా’ అంటూ పేర్కొన్నారు. కొంతకాలంగా ట్రంప్​ ఓటమిని అంగీకరించకపోవడంతో అధికార మార్పిడి ఆలస్యమైంది. అయితే తాజాగా ట్రంప్​ బైడెన్‌ బృందంతో కలిసి పని చేయాల్సిందిగా జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (జీఎస్‌ఏ) చీఫ్‌ ఎమిలీ ముర్ఫీకి ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన ముర్పీపై ప్రశంసలు కురిపించారు. దేశం పట్ల ఆమెకు ఎంతో అంకితభావం ఉన్నదని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికలు ముగిశాయని.. విభేదాలను, ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకోవడాన్ని ఆపేయాల్సిన సమయం వచ్చిందని జో బైడెన్‌ పేర్కొన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు తనకు సమానమేనని పేర్కొన్నారు.