Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ మళ్లీ విధించను.. జోబైడెన్ పై మెత్తబడ్డ ట్రంప్

By:  Tupaki Desk   |   14 Nov 2020 3:00 PM IST
లాక్ డౌన్ మళ్లీ విధించను.. జోబైడెన్ పై మెత్తబడ్డ ట్రంప్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకోకుండా పేచీ పెడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మెత్తబడ్డారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ న్యాయం పోరాటం చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.ఇప్పటివరకు బైడెన్ గెలిచాడనే అంశాన్ని స్పష్టం చేయని ట్రంప్.. తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి ఓటమిని అంగీకరించినట్టైంది.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో అమెరికాలో కరోనా కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి లాక్ డౌన్ విధించబోనని ట్రంప్ ప్రకటించారు. దీనిపై తన తర్వాత వచ్చే అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దేశంలోని ప్రజలందరికీ ఏప్రిల్ లో వ్యాక్సిన్ అందజేస్తామని ట్రంప్ ప్రకటించారు.

కేసులు పెరుగుతున్నందున లాక్ డౌన్ విధించాలని అనుకోమని.. తమ ప్రభుత్వం ముందుకెళ్లదని ట్రంప్ చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలన్నారు. ఈ ప్రశ్నలకు భవిష్యత్తులో సమాధానం వస్తుందన్నారు.

ఎన్నికల తర్వాత అవకతవకలు జరిగాయని.. న్యాయపోరాటం చేస్తున్న ట్రంప్ ఎట్టకేలకు అన్ని రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డ వేళ తన ఓటమిని అంగీకరించాడు. బిడెన్ విజయం సాధించారని పరోక్షంగా ప్రస్తావించారు. కానీ ఎక్కడా బిడెన్ పేరును మాత్రం ప్రస్తావించకపోవడం విశేషం.