Begin typing your search above and press return to search.

వారితో మాట్లాడే ఆలోచన అసలు లేదు ..చైనా పై ట్రంప్ ఆగ్రహం !

By:  Tupaki Desk   |   15 July 2020 11:15 AM GMT
వారితో మాట్లాడే ఆలోచన అసలు లేదు ..చైనా పై ట్రంప్ ఆగ్రహం !
X
అగ్రరాజ్యం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ మరోసారి చైనా పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుండి చైనా పై వీలుచిక్కినప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ట్రంప్ తాజాగా మరోసారి చైనా పై తన ఆగ్రహన్నీ ప్రదర్శించారు. మళ్లీ చైనాతో మాట్లాడటం కానీ , సంబంధం పెట్టుకోవడం కానీ ఉండదు అని తేల్చేశారు . ఈ సందర్భంగా అధినేత ట్రంప్ మాట్లాడుతూ .. మళ్లీ చైనాతో మాట్లాడను , కరోనా ను కట్టడి చేయడంలో వారు పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఏడాది మొదట్లోనే చైనాతో గొప్ప వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. ఫేస్‌1 అగ్రీమెంట్‌పై సంతకాలు కూడా అయ్యాయి , అయితే , ఆ సిరా ఇంకా ఆరకముందే వారు మమ్మల్ని కరోనా వైరస్‌ తో దెబ్బ తీయాలని చూశారు. దీనితో మళ్లీ వారిని క్షమించాలని అనుకోవడం లేదు అని తెలిపారు.

కరోనా వల్ల ప్రపంచానికి కలిగిన నష్టానికి చైనానే బాధ్యత వహించాలి అని, అంతేకాక ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద కూడా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ ‌ఓ చైనా చేతిలో కీలుబొమ్మ అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. అంతేకాక మా ప్రభుత్వం చాలా ముందుగానే చైనా, యూరోప్‌ నుంచి ప్రయాణాలను బ్యాన్‌ చేసి చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఇలా చేసి మేం చాలామంది ప్రాణాలు కాపాడం. ప్రజలంతా ఒక విషయం గమనించాలి.. చైనాపై పొరాడటానికి, కరోనా నుంచి ప్రజలను కాపాడటానికి మేం సమాఖ్య ప్రభుత్వ పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నాం అన్నారు. అలాగే , అతి త్వరలో కరోనా వైరస్‌ కు వ్యాక్సిన్‌ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ట్రంప్‌ తెలిపారు.

కాగా , అమెరికాలో ఇప్పటివరకు 35 లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అలాగే లక్షా 40 వేలమంది వరకు కరోనా భారిన పడి చనిపోయారు. ఇంకా అమెరికా లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికి ఇంకా అక్కడ ప్రతిరోజూ కూడా 60 వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.