Begin typing your search above and press return to search.

భారత వ్యాపారవేత్తలకు ట్రంప్ వ్యాపార చిట్కాలు

By:  Tupaki Desk   |   26 Feb 2020 11:30 AM GMT
భారత వ్యాపారవేత్తలకు ట్రంప్ వ్యాపార చిట్కాలు
X
ఏ కంపెనీలు పెట్టాలి.. ఎందులో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి.. ఏ రంగానికి డిమాండ్ ఉంది, ఎంత పెడితే ఎంత లాభం వస్తుంది తదితర వివరాలు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ భారత పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలో భారత వ్యాపారవేత్తలతో భేటీ అయిన సందర్భంగా స్వతహాగా పారిశ్రామిక వేత్త కావడంతో ట్రంప్ లోని కార్పొరేట్ మనిషి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా భారత్ లో పరిశ్రమ పరిస్థితి అడిగి తెలుసుకున్న అనంతరం కార్పొరేట్ వర్గాల నుంచి ప్రశ్నలు ఆహ్వానించారు. ఈ క్రమంలో స్టీల్, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్స్, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర కార్పొరేట్ రంగాలకు చెందిన సీఈఓలు, ప్రమోటర్లతో మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు.

అమెరికాలో భారత వ్యాపారస్తులు పెట్టుబడులపై ప్రశంసలు కురిపిస్తూనే మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహించారు. ఎక్కడ, ఎలా, ఎంత... చెబుతా అమెరికాలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఎంత పెట్టుబడులు పెట్టాలి అనే అంశాలపై ప్రశ్నించాలనుకుంటే వాటికి సమాధానం ఇస్తానని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో ట్రంప్ చెప్పారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమై వివిధ ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అందులో ముఖ్యంగా 3 బిలియన్ డాలర్ల హెలికాప్టర్ల కొనుగోలుపై ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. మరిన్ని పెట్టుబడులు పెట్టండి అమెరికా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి విదేశీ పెట్టుబడుల కోసం చూస్తున్నట్లు వివరించారు.

వ్యాపారానికి అనువైన పరిస్థితులను తమ దేశంలో నెలకొల్పుతానన్నారు. అడ్డంకులను తొలగించి, నిబంధనల్ని సరళతరం చేస్తామన్నారు. మీ విజయాలకు నా శుభాకాంక్షలని, మీరు అమెరికాకు వచ్చి మరిన్ని బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని కోరారు. మీరు పెట్టే పెట్టుబడులు తన దృష్టిలో ఉద్యోగాలు అని ట్రంప్ పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టాటా సన్స్ చైర్మన్ ఎన్‌.చంద్రశేఖరన్, ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు.

అమెరికాలో వ్యాపార నిర్వహణకు ఎన్నో రెగ్యులేటరీ సవాళ్లను, పాలనా, చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కార్పొరేట్ వర్గాల ఆందోళనలపై ట్రంప్‌ స్పందిస్తూ ఆ ఇబ్బందులు తొలగిస్తామని ప్రకటించారు. ఆ తేడాను త్వరలోనే మీరే గమనిస్తారని తెలిపారు. ఇరుదేశాల సంస్థలు పరస్పరం ఒకరి దేశంలో మరొకరు పెట్టుబడులు పెట్టుకోవాలని సూచించారు. ఉద్యోగాలు సృష్టించేది మీరే.. పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వాలు పరిశ్రమలకు అనుకూల సవరణలు తెస్తారని, తద్వారా ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వాలు కేవలం సహాయం చేస్తాయని, నిజానికి ఉద్యోగాలను కల్పించేది ప్రయివేటు పరిశ్రమలే కార్పొరేట్ వర్గాన్ని ప్రోత్సహిస్తూ తెలిపారు.