Begin typing your search above and press return to search.

టీసీఎస్‌ పై ట్రంప్ ఎఫెక్ట్ లేదుః చంద్ర‌శేఖ‌ర‌న్‌

By:  Tupaki Desk   |   17 Jun 2017 10:02 AM GMT
టీసీఎస్‌ పై ట్రంప్ ఎఫెక్ట్ లేదుః చంద్ర‌శేఖ‌ర‌న్‌
X
ట్రంప్ అనుస‌రిస్తున్న విధానాలు త‌మ సంస్థ‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతున్నాయ‌ని ఓ వైపు విప్రో గ‌గ్గోలు పెడుతోంది. మ‌రోవైపు, ట్రంప్ విధానాలు, వీసా నిబంధనల వ‌ల్ల త‌మ‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేద‌ని టీసీఎస్ చైర్మ‌న్‌ చంద్రశేఖరన్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ మందగమనంలో ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రశేఖరన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

టీసీఎస్ తన ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని విజయవంతంగా నిలిచిందన్నారు. ప్రపంచ వ్యాపార సంస్థలు డిజిటల్ దిశగా వేగంగా మారుతున్నాయ‌న్నారు. భవిష్యత్తులో అన్ని రంగాలకు డేటా ఎక్స్ లెన్స్ కీలకం కానుందన్నారు. డిజిటల్ టెక్నాలజీస్ పై 2లక్షల మంది ఉద్యోగులకు టీసీఎస్ ఇప్పటికే తగిన శిక్షణ ఇచ్చిందన్నారు.

డిజిటల్ ఆదాయం 28 శాతం వృధ్దితో 300 కోట్ల డాలర్లకు పెరిగింద‌న్నారు. టెక్నాల‌జీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. భారత్ కు అపారమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. వాటిని ఉప‌యోగించుకొని భారత్ ను మరింత అభివృద్ది చేయ‌వ‌చ్చ‌న్నారు.

అమెరికాతోపాటు ప్ర‌తి దేశంలోను అక్క‌డి నియ‌మనిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేప‌డుతున్నామ‌ని చంద్రశేఖ‌ర‌న్ అన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 79 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకొన్నామని కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేశ్ గోపినాథన్ చెప్పారు. వీరిలో విదేశాల్లో ఉద్యోగాలిచ్చిన వారి సంఖ్య 11,500 వరకు ఉందన్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/